బాహుబలి సినిమా చూశాక స్టార్ హీరోలు అందరికీ అలాంటి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా చేయాలని.. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేయడం ద్వారా భారీ విజయాన్ని అందుకోవాలని ఆశ పుట్టింది. మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందే ‘సైరా నరసింహారెడ్డి’ పేరుతో పాన్ ఇండియా స్థాయి సినిమానే చేశాడు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ మామూలు సినిమాలకే పరిమితం అయ్యారు.
కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న ‘విశ్వంభర’ వేరే లెవెల్ అన్నది టీం వర్గాల మాట. ఈ సినిమా టీజర్ చూసినా.. చిరు ఏదో ఎక్స్‌ట్రార్డినరీ సినిమానే చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ తరహాలో ఫాంటసీ టచ్ ఉన్న విజువల్ వండర్ ట్రై చేస్తున్నట్లున్నాడు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ. ఎక్కువ హడావుడి చేయకుండా అతను తన టీంతో కలిసి సైలెంటుగా సినిమాను లాగించేస్తున్నాడు.
సంక్రాంతికే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం మీద హైప్ పెరిగేలా మాట్లాడాడు వశిష్ఠ. ఈ చిత్రానికి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాలే రెఫరెన్స్ అనే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించిన వశిష్ఠ.. ఆ సినిమాలాగే ‘విశ్వంభర’ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాడు.
చిరంజీవి కెరీర్లో టాప్-5 సినిమాలు తీసుకుంటే.. అందులో ‘విశ్వంభర’ కూడా ఒకటిగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని వశిష్ఠ చెప్పాడు. చిరు అభిమానులు చాలా కాలం ఈ సినిమాను గుర్తుంచుకుంటారన్నాడు. ప్రేక్షకులను ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని.. సెట్టింగ్స్, గ్రాఫిక్స్ అన్నీ కూడా భారీ స్థాయిలో ఉంటాయని అతనన్నాడు. కథ దగ్గర్నుంచి అన్నీ గమ్మత్తుగా అనిపిస్తాయని.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయని.. హాలీవుడ్ మార్వెల్ సినిమాల లెవెల్లో ఇది ఉంటుందని వశిష్ఠ చెప్పడం విశేషం. ఈ మాటలతో మెగా అభిమానుల్లో ‘విశ్వంభర’ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on August 4, 2024 6:16 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…