సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం.. ‘డబుల్ ఇస్మార్ట్’. ఇంకో రెండు వారాల్లోపే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు 15కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఐతే ముందు అనుమానించినట్లుగానే రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి తలనొప్పులు తప్పట్లేదు.
దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ చివరి చిత్రం లైగర్‌కు నష్టాకు సంబంధించిన తలనొప్పులు ఈ చిత్రాన్ని చుట్టుకున్నాయి. లీగల్‌గా చూస్తే పూరి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. లైగర్ మరీ దారుణంగా దెబ్బకొట్టిన నేపథ్యంలో బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయనపై పడింది.
కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన పంచాయితీ నడుస్తోంది. ఈ వ్యవహారం ఎంతైనా డబుల్ ఇస్మార్ట్ టీంను కలవరపెడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు డబుల్ ఇస్మార్ట్‌లో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందనే విషయంలో సందేహలున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయానికి బలం చేకూర్చేలా పూరి తర్వాతి చిత్రం లైగర్ డిజాస్టర్ అయింది. దీంతో ఆయన పనితనం మీద మళ్లీ సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 60 కోట్లు పెట్టి డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కుల కొన్న నిర్మాత నిరంజన్ రెడ్డికి కూడా రికవరీ అంత తేలిక కాదు.
ఇంకోవైపు లైగర్ పుణ్యమా అని థియేటర్ల సమస్య ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా డబుల్ ఇస్మార్ట్ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఏమంత గొప్పగా అనిపించలేదు. పాటలు ఓ మోస్తరుగా అనిపించాయి. టీజర్ జస్ట్ ఓకే అనిపించింది. మిస్టర్ బచ్చన్‌తో ప్రమోషన్లలో డబుల్ ఇస్మార్ట్ టీం వెనుకబడిందన్నది స్పష్టం.
ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఆ ట్రైలర్ స్ట్రైకింగ్‌గా ఉంటే.. ఆటోమేటిగ్గా బజ్ క్రియేట్ అవుతుంది. టీంలో ఉత్సాహం వస్తుంది. అప్పుడు మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకుని, సినిమాను మరింత బాగా ప్రమోట్ చేసి హైప్ మధ్య రిలీజ్ చేయడానికి అవకాశముంటుంది.
This post was last modified on August 4, 2024 10:39 am
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…