Movie News

కంగువ‌-2.. ఎవ‌రూ పోటీకి రార‌ట‌

తెలుగులో శౌర్యం అనే రెగ్యుల‌ర్ మాస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు త‌మిళ సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌. ఆ త‌ర్వాత అత‌ను తెలుగులో తీసిన శంఖం, ద‌రువు.. త‌మిళంలో తెర‌కెక్కించిన సిరుత్తై (విక్ర‌మార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె స‌గ‌టు మాస్ మ‌సాలా చిత్రాలే.

అలాంటి ద‌ర్శ‌కుడు సూర్య‌తో జ‌ట్టు క‌డుతుంటే.. ఇంకో రెగ్యుల‌ర్ మాస్ మూవీనే వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం క‌లిసి ఒక విజువ‌ల్ వండ‌ర్ తీస్తున్నార‌ని.. కంగువ‌ ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజైన‌పుడే అంద‌రికీ అర్థ‌మైపోయింది.

అందులో విజువ‌ల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేప‌థ్యం అన్నీ చూసి ప్రేక్ష‌కుల‌కు మ‌తి పోయింది. సినిమాపై ఒక్క‌సారిగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన మ‌రో టీజ‌ర్, తొలి పాట‌లో విజువ‌ల్స్ అవీ చూశాక జ‌నాల‌కు మ‌తిపోయింది. సినిమాకు హైప్ ఇంకా పెరిగిపోయింది.

ఐతే కంగువకు ఎంత హైప్ ఉన్న‌ప్ప‌టికీ ద‌స‌రా టైంలో దానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ త‌ప్పేలా లేదు. అజిత్ మూవీ విడాముయ‌ర్చితో పాటు తెలుగులో కూడా ఏదో ఒక పేరున్న సినిమా ద‌స‌రాకు రిలీజ‌వుతుంద‌ని భావిస్తున్నారు.

ఐతే కంగువ కంటెంట్ గురించి తెలియ‌క ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నార‌ని.. ఈ సినిమా రిలీజ‌య్యాక అంతా మారిపోతుంద‌ని అంటున్నాడు ఈ చిత్ర నిర్మాత, సూర్య క‌జిన్ జ్ఞాన‌వేల్ రాజా. కంగువ ఎలాంటి సినిమానో పూర్తిగా తెలియ‌క‌, ఇందులో కంటెంట్ గురించి అవ‌గాహ‌న లేక కొన్ని సినిమాలు దీంతో పాటు ప‌డేలా క‌నిపిస్తున్నాయి.

కానీ కంగువ రిలీజ‌య్యాక క‌థ మారుతుంది. కంగువ‌-2కు ఎవ‌రూ పోటీ రారు. కంటెంట్ అంత బ‌ల‌మైంది అని జ్ఞాన‌వేల్ రాజా అన్నాడు. ఏకంగా ప‌ది భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న‌ కంగువ సినిమా వెయ్యి కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని జ్ఞాన‌వేల్ రాజా ధీమా వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 10న కంగువ‌-1 విడుద‌ల‌వుతుంది.

This post was last modified on August 4, 2024 10:12 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

48 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago