టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ ఆయన చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం దశాబ్ద కాలం నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. శ్రీరస్తు శుభమస్తు మినహాయిస్తే తన కెరీర్లో నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేదు.
కొత్త జంట, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలు మాత్రం ఓ మోస్తరుగా ఆడాయి. ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ కెరీర్ గాడినపడ్డట్లే కనిపించింది కానీ.. తర్వాతి చిత్రాలు నిరాశపరచడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.
దీంతో హిట్ కోసం శిరీష్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. శిరీష్ కొత్త చిత్రం తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న స్టూడియో గ్రీన్‌లో కావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ చిత్రమే.. బడ్డీ.
ఇది ఓ హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్‌గా తెరకెక్కిన ‘టెడ్డీ’ అనే తమిళ సినిమా ఆధారంగా తెరక్కింది. రీమేక్ అంటే యాజిటీజ్ తీసేశారని కాదు కానీ.. మన నేటివిటీకి తగ్గట్లు కథను, పాత్రలను కొంచెం మార్చారు. కానీ సినిమా చూస్తే మాత్రం ‘టెడ్డీ’ దీని కంటే చాలా బెటర్‌గా అనిపిస్తుంది.
తెలుగులో మరీ ఇల్లాజికల్ సీన్లు, ఎమోషన్ లెస్ క్యారెక్టర్లతో సినిమాను తేల్చి పడేశారనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రొడక్షన్. కంటెంట్ పరంగా క్వాలిటీ కనిపించలేదు. జ్ఞానవేల్ రాజా లాంటి పెద్ద నిర్మాత ఇంత లో క్వాలిటీ సినిమా తీశాడేంటి.. దీన్నసలు అల్లు అరవింద్ ఎలా వదిలేశారు.. మొత్తంగా సినిమా రష్ చూసుకున్నపుడు ఆయనకు ఏమీ అనిపించలేదా అన్న సందేహాలు కలిగాయి. ఐతే రష్ చూశాక సినిమాను మెరుగు పరచడానికి ఛాన్స్ కూడా లేదని.. దీని మీద ఆశలు కోల్పోయి ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేశారేమో అని సందేహాలు కలుగుతున్నాయి.
శిరీష్ తొలి చిత్రం ‘గౌరవం’ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ చిత్రం ఆడదన్న అనుమానంతో దాన్ని అరవింద్ ఓన్ చేసుకోలేదు. రిలీజ్ మమ అనిపించారు. సినిమా వచ్చింది వెళ్లింది తెలియనట్లు జరిగిపోయింది. ‘బడ్డీ’ని కూడా పెద్దగా ప్రమోట్ చేయకుండా, పబ్లిసిటీ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా రిలీజ్ లాగించేయడం చూస్తే దీని మీద టీంలో ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవేమో అనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రానికి రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది.
This post was last modified on August 4, 2024 10:17 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…