కొందరు నటులు తెర మీద ఫన్నీ క్యారెక్టర్లు వేయడమే కాదు.. బయట కూడా అంతే సరదాగా కనిపిస్తారు. మాట్లాడతారు. యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ఈ కోవకే చెందుతాడు. అతను తన సినిమాలను ప్రమోట్ చేసే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. ఏదైనా సినిమా వేడుకలకు హాజరైనా తన సందడే వేరుగా ఉంటుంది.
ఐతే ఇప్పుడు నవీన్ ఏ సినిమా చేయట్లేదు. ఏ వేడుకలోనూ పాల్గొనే స్థితిలో కూడా లేడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రిలీజ్ తర్వాత అతను ఓ ప్రమాదంలో గాయపడి కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఇటీవలే చేతికి కట్టుతో ఉన్న ఫొటో పెట్టి ప్రస్తుతం తాను రెస్ట్‌లో ఉన్నానని.. కోలుకోవడానికి టైం పడుతుందని.. కొత్త సినిమాల చర్చలు జరుగుతున్నాయని.. వాటి గురించి త్వరలో తెలియజేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా నవీన్ తన హెల్త్ అప్‌డేట్ మీద ఒక ఫన్నీ వీడియో చేశాడు. అందులో తన గాయం మీద తనే పంచులు వేసుకున్నాడు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనే వెంకీ డైలాగ్ ఉన్న ‘గణేష్’.. చెయ్ చూశావా ఎంత రఫ్‌గా ఉందో అంటూ చిరు డైలాగ్ పేల్చే ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాల్లో సన్నివేశాలు చూస్తూ తన చేయి విషయంలో ఫ్రస్టేట్ అయ్యేలా ఈ వీడియో రూపొందించారు.
చివరికి చేత్తో అన్నం తినలేక ఇబ్బందిపడే సరదా దృశ్యం కూడా ఇందులో పెట్టారు. అన్నీ చూపించి హాస్యం లేకుంటే జీవితం లేదని.. తాను ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నానని.. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు చెబుతానని తనదైన శైలిలో హెల్త్ అప్‌డేట్ ఇచ్చాడు నవీన్. ప్రస్తుతం నవీన్ రెండు కొత్త చిత్రాలు అంగీకరించాడని.. కొత్త ఏడాదిలో వాటి షూట్ మొదలవుతుందని సమాచారం.
This post was last modified on August 3, 2024 10:05 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…