Movie News

బాలీవుడ్ స్టార్ సినిమా.. దయనీయం


ఒకప్పుడు బాలీవుడ్‌ను రూల్ చేసిన పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. అక్షయ్ కుమార్ సంగతే తీసుకుంటే.. ఒక దశలో ఖాన్ త్రయానికి అతను దీటుగా నిలబడ్డాడు. నిలకడగా హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఓ మోస్తరు విజయం కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. కరోనా తర్వాత అక్షయ్ ప్రేక్షకులతో డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. వరుసగా 16 ఫెయిల్యూర్లు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ ‘సర్ఫీరా’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

ఇప్పుడు అజయ్ దేవగణ్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఆయనకు కూడా కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేవు. ఈ ఏడాది ‘మైదాన్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు. దాంతో పోలిస్తే అజయ్ కొత్త చిత్రం ‘ఆరో మే కహా దమ్ తా’ చిత్రం పరిస్థితి ఘోరంగా ఉంది.

స్పెషల్ చబ్బీస్, బేబీ, ఎం.ఎస్.ధోని లాంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన నీరజ్ పాండే రూపొందించిన చిత్రమిది. అజయ్‌తో పాటు టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి మినిమం బజ్ లేదు. శుక్రవారం ఈ చిత్రం రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు పట్టట్లేదు. బాలీవుడ్లో పెద్ద మాస్ హీరోగా పేరున్న అజయ్ చిత్రానికి ఇంత లో బజ్ ఎప్పుడూ లేదు.

‘సర్ఫీరా’ చిత్రానికి కేవలం రెండు కోట్ల ఓపెనింగ్స్ రాగా.. ‘ఆరో మే కహా దమ్ తా’ కూడా దాదాపుగా అదే స్థాయిలో ఆరంభ వసూళ్లు తెచ్చుకునేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ సహా ఏ ప్రోమో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. నీరజ్ పాండే ఫాంలో లేని విషయం అక్కడే అర్థమైపోయింది. అయినా సరే.. అజయ్ కోసమైనా జనం ఆసక్తి చూపిస్తారనుకుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఇది డిజాస్టర్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ముందే ఒక అంచనాకు వచ్చేశాయి.

This post was last modified on August 1, 2024 12:55 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

35 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago