Movie News

పుష్ప-2ను ఎలా ముగిస్తారబ్బా..?

పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక పార్ట్‌గానే తీయాలనుకున్నారు. కానీ ‘బాహుబలి’ తరహాలోనే మేకింగ్ దశలో అది రెండు భాగాలుగా మారింది. ఫస్ట్ పార్ట్‌కు తెలుగులో మిక్స్డ్ టాకే వచ్చినా.. సినిమాను అసంపూర్తిగా వదిలేశారన్న అసంతృప్తి వ్యక్తమైనా.. ఎలాగోలా ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నెట్టుకొచ్చేసింది. సెకండ్ పార్ట్‌కు బంపర్ క్రేజ్ వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అవుతుండడం ప్రతికూలంగా మారింది.

షెడ్యూల్ ప్రకారం ఇంకో రెండు వారాల్లో రిలీజ్ కావాల్సిన సినిమా.. ఏడాది చివరికి వెళ్లిపోయింది. అప్పుడైనా రిలీజవుతుందా లేదా అనే సందేహాలు కలిగాయి ఈ మధ్య. కానీ ఇప్పుడు ‘పుష్ప-2’ టీం ట్రాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న బన్నీ వచ్చే వరకు వేరే నటీనటుల కాంబినేషన్లో సన్నివేశాలు లాగించేస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో బన్నీ షూట్‌లో జాయినవుతాడన్నది తాజా సమాచారం.

బన్నీ మీద క్లైమాక్స్ ఫైట్, అలాగే ఓ పాట చిత్రీకరించాల్సి ఉంది. మొత్తంగా ఇంకో నెల రోజులపైనే షూట్ మిగిలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప-2ను ఎలా ముగించాలనే విషయంలో ఇప్పుడు టీంలో తర్జనభర్జనలు నడుస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందైతే ‘పుష్ప-3’ తీయాలనుకున్నారు. అందుకు అనుగుణంగా కథను ఇంకాస్త పొడిగించారు. సెకండ్ పార్ట్‌కు ఒక ముగింపు కూడా సెట్ చేశారు. కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు చాలా మారాయి. పుష్ప-2నే చాలా ఆలస్యమై రిలీజ్ వాయిదా పడడంతో నెగెటివిటీ తప్పలేదు. పైగా సుకుమార్, బన్నీల మధ్య కొంత డిస్టబెన్స్ కూడా వచ్చిందంటున్నారు. ఈ చిత్రం బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ పెరగడంతో పాటు రకరకాల సమస్యలతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడిపోయారు. ఈ పరిస్థితుల మధ్య వీళ్లంతా కలిసి ఇంకో పార్ట్ చేయడం కష్టమనే భావన యూనిట్ వర్గాల్లో నెలకొంది.

పుష్ప-2 కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులు కూడా.. ఈ కథను ముగించకుండా ఇంకో పార్ట్ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముగింపు మారుద్దామా అని టీంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పార్ట్-2లో ఈ కథకు ఒక ఎండ్ పాయింట్ ఇస్తేనే మంచిదని.. తర్వాత పార్ట్-3 తీయాలనుకుంటే ఎలాగోలా దానికి లీడ్ తీసుకోవచ్చని.. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో కథ మధ్యలో ఆగినట్లు చూపిస్తే ప్రతికూలమే అవుతుందని అనుకుంటున్నారట.

This post was last modified on August 1, 2024 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

42 minutes ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

9 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

12 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

13 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

13 hours ago