Movie News

జులైలో హాహాకారాలు.. ఆగస్టు మీదే ఆశలు

కొత్త ఏడాదిలో సినిమాలకు అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి. సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. సగటున నెలకో పెద్ద హిట్ కూడా పడలేదు. సంక్రాంతికి హనుమాన్, వేసవికి టిల్లు స్క్వేర్, ఆ తర్వాత కల్కి తప్ప పెద్ద హిట్లు లేవు. ఇలా ఓ పెద్ద సక్సెస్ రాగానే బాక్సాఫీస్ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది కానీ.. ఆ వెంటనే స్లంప్ మొదలవుతోంది. డ్రై పీరియడ్ థియేటర్లకు చుక్కలు చూపిస్తోంది.

‘కల్కి’ రిలీజ్ తర్వాత నెల రోజుల పాటు ఓ మోస్తరు సక్సెస్ అయిన సినిమా కూడా ఏదీ లేదు. ‘ఇండియన్-2’ దారుణమైన డిజజాస్టర్‌గా మిగలగా.. మిగతా చిత్రాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. డార్లింగ్, రాయన్ సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మొత్తంగా జులై నెల బాక్సాఫీస్‌లో హాహాకారాలే చూశాం. ఇప్పుడిక ఆగస్టు మీదికి ఫోకస్ మళ్లింది. ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తోంది.

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రానున్న తెలుగు చిత్రాలు డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్‌లతో పాటు తమిళ అనువాదం ‘తంగలాన్’ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూడు బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తాయని ఆశిస్తున్నారు. ఇక నెలాఖర్లో రానున్న నాని సినిమా ‘సరిపోదా శనివారం’ను ఈ నెలలో రానున్న క్రేజీయెస్ట్ మూవీగా చెప్పొచ్చు. దానికి ముందు వారం, ఇప్పుడు తొలి రెండు వారాల్లో కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి.

ఈ వారం శివం భజే, బడ్డీ, తిరగబడరా సామీ‌తో పాటు చాలా సినిమాలే రిలీజవుతున్నాయి. ఈ మూడు చిత్రాలే కొంచెం చెప్పుకోదగ్గవి. ‘బడ్డీ’ మూవీ టికెట్ల ధరలు కూడా తగ్గించుకుని థియేటర్లలోకి దిగుతోంది. ఆ చిత్రానికి ఓపెనింగ్స్ బెటర్‌గా ఉండొచ్చు. టాక్‌ను బట్టి సినిమా ఫలితం తేలుతుంది. మిగతా రెండు చిత్రాలకు పెద్దగా బజ్ లేదు. వీటికి కూడా టాక్ చాలా కీలకం కానుంది.

This post was last modified on August 1, 2024 12:39 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

33 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago