Movie News

శ్రీలీల వదులుకున్న బాలీవుడ్ ఆఫర్

ఎంత తెలుగులో పేరున్నా బాలీవుడ్ అవకాశాలు వస్తే మన హీరోయిన్లు వాటిని అంత సులభంగా వదలుకోరు. అప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి పూజా హెగ్డే దాకా లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. శ్రీలీల కూడా ఈ లిస్టులో చేరాలని ప్లాన్ చేసుకుంది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆఫర్లు ఒప్పుకుంది.

అందులో ఒకటి వదులుకుందని ముంబై అప్డేట్. వరుణ్ ధావన్ హీరోగా అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్ టైనర్ ని డేట్ల సర్దుబాటు కాలేని కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసినట్టు తెలిసింది. మరో హీరోయిన్ గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

నిజంగా అదే రీజనా లేక పాత్రకు సంబంధించిన ప్రాధాన్యం తక్కువ ఉందని ఫీలవ్వడం వల్లనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శ్రీలీల చేతిలో మరో మూవీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించబోయే డైలర్ లో కథానాయికగా శ్రీలీలనే ఉంటుందట.

కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇబ్రహీం డెబ్యూ మూవీ సర్ జమీన్ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే రెండోది లండన్ లో మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలీల దీంట్లోనే జాయిన్ కాబోతోంది. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రొమాంటిక్ జానర్ లో రూపొందుతుంది.

జరిగేదంతా మంచికే అన్నట్టు వరుణ్ ధావన్ సరసన మిస్ కావడం శ్రీలీలకు పెద్ద నష్టమేమి కాదు. పైగా ఫామ్ లో లేని డేవిడ్ ధావన్ డైరెక్షన్ అంటే ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలియదు. సో ఒక రకంగా రిస్క్ తగ్గిందని అనుకోవాలి.

గత ఏడాది అక్టోబర్ నుంచి వరస తెలుగు సినిమాలతో నెలకోసారి పలకరించిన శ్రీలీల గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకుంది. నితిన్ రాబిన్ హుడ్ లో ఛాన్స్ కొట్టేసి ప్రస్తుతం దాని షూటింగ్ లోనే బిజీగా ఉంది. రవితేజ, దర్శకుడు భాను భోగవరపు కాంబో మూవీ తన ఖాతాలోనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on August 1, 2024 10:39 am

Share
Show comments
Published by
Satya
Tags: Sree leela

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

9 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

9 hours ago