మాములుగా ఒక రీమేక్ ని వీలైనంత వరకు మార్చకుండా తీయడం అధిక శాతం దర్శకులు పాటించే శైలి. ఒరిజినల్ ని కిల్ చేశారనే కామెంట్స్ రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. కానీ హరీష్ శంకర్ స్టయిల్ వేరు. స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టు కమర్షియల్ మసాలాలు జోడించి ప్రేక్షకులను మెప్పించడం అతనికి కొట్టిన పిండి. దబాంగ్ ని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా ప్రకటించినప్పుడు అది ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. కల్ట్ అని చెప్పుకునే జిగర్ తండాని గద్దలకొండ గణేష్ గా ఛేంజ్ చేసినప్పుడు మూవీ లవర్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇదీ హిట్టే.
ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ మెటీరియల్ చూస్తుంటే వాటిని మించి హరీష్ శంకర్ ఈసారి మార్పుల ప్రహసనం చేసినట్టు కనిపిస్తోంది. అజయ్ దేవగన్ రైడ్ చాలా సీరియస్ డ్రామా. హీరోయిన్ ఇలియానా ఎలాంటి గ్లామర్ షోకి అవకాశం లేని భార్య పాత్ర చేసింది. విలన్ సౌరభ్ శుక్లా ఇంటి మీద ఇన్కమ్ టాక్స్ రైడింగ్ అయ్యాక జరిగే ట్విస్టులన్నీ మాస్ మీటర్ లో ఉండవు. అయినా స్క్రీన్ ప్లే కట్టిపడేసేలా ఉంటుంది. అందుకే అంత విజయం దక్కింది. కానీ మిస్టర్ బచ్చన్ పూర్తిగా వేరే రూటు తీసుకున్నాడు. ప్రియురాలు, డ్యూయెట్లు, ఎలివేషన్ ఫైట్లు, రొమాన్స్ ఒకటేమిటి అన్నీ దట్టించాడు.
ఒకవేళ మిస్టర్ బచ్చన్ కనక బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయితే సమస్య లేదు. హరీష్ శంకర్ మళ్ళీ తన మేజిక్ చేశాడనే ప్రశంసలు వస్తాయి. ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా రైడ్ ని ఇలాగా తీసేదంటూ విమర్శకులు బాణాలు ఎక్కుపెడతారు. అసలే అపోజిషన్ లో డబుల్ ఇస్మార్ట్ లాంటి ఊర మాస్ కమర్షియల్ బొమ్మ పోటీలో ఉంది. దాన్ని తట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే మిస్టర్ బచ్చన్ కి ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లకు రంగం సిద్ధమవుతోంది. నెక్స్ట్ డేనే నేషనల్ హాలిడే కాబట్టి వీటికి భారీ స్పందన వస్తుందనే నమ్మకం టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.
This post was last modified on August 1, 2024 10:07 am
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…