అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన పోటీ ఉన్నా సరే కంటెంట్ మీద నమ్మకంతో నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేసుకుంటున్న బన్నీ తమ్ముడు ఫలితం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే తన మాటల్లో చాలా ప్రాక్టికాలిటీ (వాస్తవిక కోణం) కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
కేవలం మాటల ద్వారానే కాకుండా చేతల్లోనూ చూపిస్తున్నాడు. బడ్డీకి మల్టీప్లెక్సుల్లో 125, సింగల్ స్క్రీన్లలో 99 రూపాయలు టికెట్ రేట్లు పెట్టడం ద్వారా దాన్ని అమలులో పెట్టించాడు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించాడు.
అందులో ఒక ప్రశ్నకు భాగంగా మాట్లాడుతూ హిందీ మాట్లాడే జనాభా 90 కోట్లు ఉన్నప్పటికీ థియేటర్లకు వచ్చే వాళ్ళు మాత్రం మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే ఉంటారని, అదే తెలుగు కేవలం 10 కోట్ల మందే మాట్లాడినప్పటికీ సినిమా హాళ్లకు 3 కోట్లకు పైగా వస్తారని, దీన్ని బట్టే టాలీవుడ్ ప్రేక్షకులు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలన్నాడు.
బంగారు బాతుని చంపేసి తిన్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ రావాలంటే అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు పెట్టడం ద్వారా మరింత వసూళ్లు రాబట్టుకోవచ్చని, అందుకే బడ్డీ ఇలా చేశామని వివరించాడు.
శిరీష్ మాట్లాడిన దాంట్లో పూర్తి లాజిక్ ఉంది. చిన్న సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం ముమ్మాటికి టికెట్ రేట్లే. కొన్నిసార్లు ఇష్టానుసారం పెంచుకుంటూ పోవడం దారుణమైన ఫలితాలను ఇస్తోంది. భారతీయుడు 2 మంచి ఉదాహరణ.
ఇప్పుడు బడ్డీ మోడల్ కనక సక్సెస్ అయితే మరింత నిర్మాతలు ఇదే దారిని అనుసరించే అవకాశం లేకపోలేదు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ముఖ్యంగా చిన్నపిల్లలను బలంగా టార్గెట్ చేసుకుంది. ఇప్పుడీ 99 రూపాయల టికెట్ల ద్వారా కుటుంబాలు ఎక్కువగా వస్తాయనే ఆశాభావం శిరీష్ బృందంలో ఉంది.
This post was last modified on July 31, 2024 6:17 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…