ఇంకో రెండు రోజుల్లో అతివృష్టి రిలీజులతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఉక్కిరిబిక్కరి కాబోతోంది. కల్కి 2898 ఏడి తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కనీస స్థాయిలో ఆడకపోవడంతో నెలరోజులకు పైగా ప్రభాస్ మూవీతోనే నెట్టుకొచ్చిన థియేటర్లు ఇప్పుడు కొత్త వాటి మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాయి.స్టార్ హీరోలవి లేకపోయినా అన్నీ కంటెంట్ నమ్ముకున్నవి కావడంతో మౌత్ టాక్ బాగా వస్తే జనం థియేటర్లకు వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. అశ్విన్ బాబు ‘శివం భజే’ ఒక రోజు ముందే ఆగస్ట్ 1 గురువారం రావడం ద్వారా తెలివైన ఎత్తుగడ వేసింది. మైథలాజి ముడిపెట్టిన క్రైమ్ థ్రిల్లర్ గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఇక అసలు జాతర ఆగస్ట్ 2 ఉంటుంది. అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత ‘బడ్డీ’తో వస్తున్నాడు. రెండు వారాలుగా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తూ తనకు తానే పిఆర్ గా మారి పబ్లిసిటీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. పది రోజుల ముందే ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్లు వేశారు. రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామీ’ మీద పెద్దగా అంచనాల్లేవ్ కానీ మాస్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని పురుషోత్తముడు వచ్చిన వారానికే రెడీ అయిపోయి ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ ఆంటోనీ ‘తుఫాను’ కోసం హీరో హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బిచ్చగాడు తప్ప ఇంకే సక్సెస్ లేని నేపథ్యంలో ఇదో పెద్ద సవాలే.
దర్శకుడు కె విజయభాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ‘ఉషా పరిణయం’ అదే రోజు రానుంది. పట్టువదలని విక్రమార్కుడిగా సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్ ‘విరాజి’ తో పలకరించబోతున్నాడు. చిన్న సినిమానే అయినా ‘అలనాటి రామచంద్రుడు’ సైతం హోమ్లీ టైటిల్ తో కుటుంబ ప్రేక్షకులకు గాలం వేస్తోంది. యావరేజ్ స్టూడెంట్ నాని, లారీ అంటూ మరికొన్ని చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ‘ఉల్లజ్’తో పాటు అజయ్ దేవగన్ ‘ఔరోన్ మే కహా ధం తా’ బరిలో ఉన్నాయి. ఇంత తాకిడిలో విజేతలు ఎవరవుతారో చూడాలి.
This post was last modified on July 31, 2024 12:03 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…