సినిమా రంగంలో అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందటం చిన్న విషయం కాదు. 1974లో తాత్తమ్మ కలతో బాలనటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఈ ఏడాదితో 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ తరఫున హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న ఘన సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వక్తలు రావడం, ప్రసంగాలు పొగడ్తలు చెప్పడం లాంటివి కాకుండా చాలా వినూత్నంగా ఎప్పటికీ నిలిచిపోయే రీతిలో గొప్పగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధ మహారథులతో అంగరంగ వైభవంగా జరగనుంది.
అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి హాజరు కాబోతున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో మొదలుపెట్టి సిద్దు జొన్నలగడ్డ లాంటి యూత్ హీరోల వరకు అందరికీ ఆహ్వానం వెళ్లబోతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత మూడు సార్లు ఏకధాటిగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సినీ నటుడిగా, 100 రోజుల నుంచి వెయ్యి రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ల హీరోగా ఎన్నో ఘనతలు సాధించిన బాలయ్య ఫ్యాన్స్ కు చిరకాల జ్ఞాపకం ఇవ్వబోతున్నారు.
అభిమానులు భారీ ఎత్తున తరలి రాబోతున్నట్టు తెలిసింది. బాలయ్య బ్లాక్ బస్టర్ పాటలకు నృత్యాలు, ఆయన సాధించిన మైలురాళ్ళకు సంబంధించిన విశేషాలు, పాత కొత్త తరం హీరోయిన్లు ఎందరో పాలు పంచుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళను సైతం ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసమే పిలిపించబోతున్నట్టు తెలిసింది. 109 సినిమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఆన్ స్టాపబుల్ షో ద్వారా ఓటిటిలోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో ఈ వేడుకలో భాగం కాబోతున్నారు. ఆహ్వాన పత్రికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.
This post was last modified on July 31, 2024 3:42 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…