సునీల్ గవాస్కర్ పేరు నిన్న రాత్రి నుంచి ట్విట్టర్లో మార్మోగిపోతోంది. ఆయన పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఐతే ఈ దిగ్గజ ఆటగాడి గురించి ఎప్పుడూ పాజిటివ్ ట్వీట్లే కనిపిస్తాయి కానీ.. ఇప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా ఆయన్ని తిడుతూ ట్వీట్లు వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆ పని చేస్తున్నది విరాట్ కోహ్లి అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమైన కోహ్లీని ఉద్దేశించి నిన్న రాత్రి కామెంట్రీలో భాగంగా ఒక చెత్త కామెంట్ చేశాడన్నది గవాస్కర్ మీద వచ్చిన ఆరోపణ. ‘‘లాక్ డౌన్ టైంలో కోహ్లి తన భార్య అనుష్క బంతులతో ప్రాక్టీస్ చేసినట్లున్నాడు’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఇందులో ద్వంద్వార్థం ఉండటంతో ఇంత చీప్ కామెంట్ గవాస్కర్ ఎలా చేశాడని కోహ్లి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
ఐతే నిజానికి గవాస్కర్ అన్న మాట వేరు.. దాన్ని ట్విస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. ‘‘లాక్ డౌన్ టైంలో కోహ్లి తన భార్య బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినట్లున్నాడు’’ అని గవాస్కర్ అన్నాడట. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఏదీ ఇంకా బయటికి రాలేదు. కానీ గవాస్కర్ ‘బౌలింగ్’ అన్న పదం వాడితే అక్కడ ‘బంతులు’ అనే పదాన్ని రీప్లేస్ చేసి ఆయన కామెంట్‌ను చీప్‌గా మార్చేశారని.. ట్రోల్ చేస్తున్నారని ఓ కథనం వినిపిస్తోంది.
గవాస్కర్ స్థాయికి ఈ ‘బౌలింగ్’ కామెంట్ అయినా సరే అభ్యంతరకరమే. క్రికెటర్ల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లడాన్ని ఆయన తప్పుబడుతుంటారు. ఏం విమర్శలు చేసినా నిర్మాణాత్మకంగా ఉంటాయి. క్రికెట్ వ్యవహారాలకే పరిమితం అవుతాయి. కానీ ఇప్పుడు అనుకోకుండా నోరు జారి ఇరుకున పడ్డారు. కాగా గవాస్కర్ కామెంట్లపై అనుష్క సైతం స్పందించింది. ఒక క్రికెటర్ వైఫల్యానికి అతడి భార్యకు ఎలా ముడిపెడతారు.. మీలాంటి దిగ్గజం ఇలాంటి కామెంట్లు ఎలా చేస్తారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
This post was last modified on September 25, 2020 4:23 pm
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్.. ఇంటర్వ్యూల్లో సినిమా సంగతులు చాలా మాట్లాడతారు కానీ.. వ్యక్తిగత విషయాల గురించి…
హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో…
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…