కొత్త సినిమాలకు ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి, కంటెంట్ మీద తమకున్న నమ్మకాన్ని చాటి చెప్పడానికి విడుదలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసే ట్రెండ్ కొన్నేళ్లుగా నడుస్తోంది టాలీవుడ్లో. ఈ ప్రయోగం బేబీ, సామజవరగమన లాంటి కొన్ని చిత్రాలకు బాగా కలిసొచ్చింది. అదే సమయంలో ప్రిమియర్స్ వల్ల దారుణంగా దెబ్బ తిన్న సినిమాలు కూడా ఉన్నాయి. రంగబలి, డార్లింగ్ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. సినిమా బాలేని పక్షంలో నెగెటిక్ టాక్ స్ప్రెడ్ అయి రిలీజ్ రోజు మార్నింగ్ షోల కలెక్షన్ల మీద కూడా ప్రభావం పడుతుంది.
అయినా సరే.. కంటెంట్ మీద ధీమాతో కొందరు ప్రొడ్యూసర్లు రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్‌కు రెడీ అయిపోతున్నారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ సినిమాల్లో రెండు చిత్రాలకు పెయిడ్ ప్రిమియర్స్ కన్ఫమ్ కావడం విశేషం.
రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్‌కు ఆగస్టు 14న పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మామూలుగా రిలీజ్ టైం దగ్గర పడ్డాక పెయిడ్ ప్రిమియర్స్ గురించి వెల్లడిస్తుంటారు. కానీ మిస్టర్ బచ్చన్ విషయంలో మాత్రం రిలీజ్ డేట్ ప్రకటనతోనే పెయిడ్ ప్రిమియర్స్ అప్‌డేట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రానున్న మరో చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ కన్ఫమ్ అయినట్లు సమాచారం.
గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటిస్తున్న ఆయ్ చిత్రానికి ఆగస్టు 14న ప్రిమియర్స్ వేస్తారట. ఆ వీకెండ్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. ఆయ్ చిత్రం మీద నమ్మకంతో రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. సినిమా చాలా బాగా రావడంతో ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్‌కు వెళ్లాలని మేకర్స్ నిర్ణయించారట. ఈ చిన్న సినిమా ఆ టైంలో ప్రేక్షకుల దృష్టిలో పడాలంటే పెయిడ్ ప్రిమియర్సే మార్గమని భావిస్తున్నారట. మరి ఆ టైంలో రానున్న రెండు చిత్రాలు ప్రిమియర్స్‌కు రెడీ అయితే.. డబుల్ ఇస్మార్ట్ టీం కూడా ఇదే బాట పడుతుందేమో చూడాలి.
This post was last modified on July 30, 2024 7:13 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…