Movie News

ప్రభాస్ సరే…. మరి తేజ సజ్జ సంగతేంటి

ది రాజా సాబ్ విడుదల తేదీ టీజర్ తో పాటు అధికారికంగా వచ్చేసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా ప్రకటించింది. దీనికి తేజ సజ్జ కనెక్షన్ ఏంటనే పాయింట్ కు వద్దాం.

మిరాయ్ మూడు నెలల క్రితమే ఏప్రిల్ 18 వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుందని హీరో పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ లో చెప్పింది. రెండింటి నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. కేవలం వారం గ్యాప్ లో రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు ఒకే బ్యానర్ వి థియేటర్లలో రావడం అంత సేఫ్ కాదు. ప్రభాస్ కాదు కానీ తేజ సజ్జకి రిస్క్ ఉంటుంది.

ఈ లెక్కన మిరాయ్ వాయిదా పడినట్టే అనుకోవాలి. లేదంటే గత ఏడాది సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ ఒక్క రోజు గ్యాప్ లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ చేసినట్టు పీపుల్స్ మీడియా కూడా చేస్తుందా అనేది వేచి చూడాలి.

నిజానికి ది రాజా సాబ్ కన్నా చాలా ఆలస్యంగా మిరాయ్ మొదలైంది. షూటింగ్ క్రమం తప్పకుండ జరుగుతోంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోస్ట్ ప్రొడక్షన్ కోసం అధిక సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీటికి సంబంధించిన స్పష్టత మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది కానీ అప్పటిదాకా వేచి చూడాల్సిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటున్న తేజ సజ్జకు మిరాయ్ చాలా కీలకం. అనూహ్యంగా వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు.

అందుకే ఆలస్యమవుతుందని తెలిసినా మిరాయ్ కే ఎక్కువ డేట్లు ఇచ్చి దాని కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ది రాజా సాబ్ వల్ల ఇంకా లేట్ అవుతుందా లేక కాస్త ముందుకొచ్చి ఫిబ్రవరి లేదా మార్చి ఆప్షన్లు చూస్తుందా అనేది కాస్త వెయిట్ చేశాక క్లారిటీ ఉంటుంది. చూద్దాం.

This post was last modified on July 29, 2024 6:42 pm

Share
Show comments
Published by
Satya
Tags: Mirai

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago