Movie News

ప్రేమ కావాలి చేజారి రేయ్ దక్కింది

ప్రతి బియ్యం మెతుకు మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు ఈ సామెత సినిమాలకూ వర్తిస్తుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ ఉషా పరిణయం. ఆగస్ట్ 2 థియేటర్లలో విడుదల కానుంది. కొడుకు శ్రీకమల్ తో ఆయన తీసిన జిలేబి అంచనాలు అందుకోలేకపోయినా మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాగా ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.

ఇది పద్నాలుగు సంవత్సరాల క్రితం సంగతి. పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ డెబ్యూని తొలుత విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనే ప్లాన్ చేశారు. అదే ప్రేమ కావాలి. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే ఆ కథనే తీసుకుని ఆది సాయికుమార్ ని టాలీవుడ్ కు లాంచ్ చేశారు. మంచి విజయంతో వసూళ్లు, ఆఫర్లు రెండూ తీసుకొచ్చింది. అదే సమయంలో వైవిఎస్ చౌదరి ప్లాన్ చేసుకున్న రేయ్ ద్వారా ఆది సాయికుమార్ పరిచయం కావాలి. కానీ అనూహ్య పరిణామంతో అది కాస్తా సాయి ధరమ్ తేజ్ డెబ్యూ అయ్యింది. ఫలితం ఏమయ్యిందో చూశాం.

చిన్న చిత్రాల పెద్ద పోటీ మధ్య ఉషా పరిణయంని తీసుకొస్తున్నారు విజయ్ భాస్కర్. క్లీన్ మూవీగా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు వారాల గ్యాప్ లో పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీనికి ఓపెనింగ్స్ కీలకంగా మారబోతున్నాయి. కల్ట్ డైరెక్టర్ గా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన విజయ భాస్కర్ కు ఉషా పరిణయం కొడుకుకో హిట్ ఇవ్వడంతో పాటు ఆయనకూ కొత్త ఇన్నింగ్స్ కి దారివ్వాలి. అది ఎంత వరకు నెరవేరుతుందో ఈ శుక్రవారం తేలనుంది. తన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా నటించింది.

This post was last modified on July 29, 2024 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేని కాజల్.. తెలుగులో వెబ్ సిరీస్

కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…

3 hours ago

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

6 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

9 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

10 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

11 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

11 hours ago