నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందని ఇన్ సైడ్ టాక్. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా రూపొందబోయే ఈ ఫాంటసీ సోషల్ డ్రామాని పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నట్టు వినికిడి. ఆన్ స్టాపబుల్ ప్రోమో షూటింగ్ సమయం నుంచే బాలయ్యతో ట్రావెల్ చేస్తున్న ప్రశాంత్ వర్మ అప్పటి నుంచే ఒక ఐడియా చెబుతూ వచ్చారట. ఫైనల్ గా ఒక వెర్షన్ ఇద్దరికీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.
అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి తెరవెనుక పనులు జరుగుతున్న మాట వాస్తవం. మోక్షజ్ఞకు ఫోటో షూట్ చేశారు. శాంపిల్ లుక్స్ ని సోషల్ మీడియాలో వదిలాక మంచి స్పందన వచ్చింది. ఊహించని విధంగా మేకోవర్ కావడం చూసి బాలయ్య ఫ్యాన్స్ సంతోషపడ్డారు. ఇంతకు ముందు ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే సత్యానంద్ తదితరుల వద్ద శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞని వీలైనంత వరకు వచ్చే ఏడాది థియేటర్లలో చూపించాలని బాలకృష్ణ కోరిక. అది నెరవేరడం ప్రశాంత్ వర్మ చేతుల్లో ఉంటుంది.
మొత్తానికి మంచి కాంబో సెట్ అయినట్టేనని చెప్పాలి. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత కొత్త జనరేషన్ నుంచి వస్తున్న హీరోగా మోక్షజ్ఞ మీద మాములు అంచనాలు ఉండబోవడం లేదు. ఇటీవలే వైవిఎస్ చౌదరి జానకిరామ్ అబ్బాయిని లాంఛ్ చేయబోతున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు కానీ అంతకన్నా ముందే మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడం ఖాయం. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజులో తీస్తారట. ఇంకో నెలయ్యాక క్లారిటీ వస్తుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…