Movie News

స్టార్ హీరో చేతికి మహారాజ రీమేక్

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్ మహారాజా తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకుంది. సోలో హీరోగా విజయ్ సేతుపతికి ఇక్కడ పెద్ద హిట్టు లేదన్న లోటుని తీర్చింది. ఇంత సక్సెస్ అయిన మూవీ మీద బాలీవుడ్ కళ్ళు పడకుండా ఉంటాయా. సీనియర్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. టైటిల్ రోల్ ఆయనే పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా డీల్ జరిగినట్టు తెలిసింది. సంతకాలయ్యాక అనౌన్స్ మెంట్ రావొచ్చు.

వాస్తవానికి విజయ్ సేతుపతి లాల్ సింగ్ చద్దాలో నటించాల్సింది. కానీ డేట్ల సమస్య రావడంతో ఇష్టం లేకపోయినా ఆ ప్రాజెక్టుని వదులుకున్నాడు. మక్కల్ సెల్వన్ నటనని పలు చిత్రాల్లో చూసిన అమీర్ కోరి మరీ తనకు పాత్ర ఆఫర్ చేసినా కాంబో కుదరలేదు. అదే నాగ చైతన్య తీసుకున్నాడు. ఫలితం డిజాస్టర్ కావడం చూసి విజయ్ సేతుపతి ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుని ఉంటారు కానీ చైతు మాత్రం ఉత్తరాదిలో బ్యాడ్ డెబ్యూ అందుకున్నాడు. సో మహారాజ చూసి అమీర్ ఖాన్ స్పెల్ బౌండ్ కావడంతో ఎలాంటి ఆశ్చర్యం లేదు. క్యాస్టింగ్, దర్శకుడు గట్రా ఇంకా లాక్ చేయాల్సి ఉంది.

తిరిగి సక్సెస్ ట్రాక్ మీద రావడం కోసం ఎదురు చూస్తున్న అమీర్ ఖాన్ కు మహారాజా బెస్ట్ ఛాయస్ అవుతుంది. నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్టయ్యే అంశాలు బోలెడు ఉన్నాయి. కాకపోతే నెట్ ఫ్లిక్స్ లో హిందీ అనువాదంతో సహా ఓటిటి వెర్షన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే బోలెడు జనాలు చూసేసి ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మొదలుపెట్టడమో లేదా కీలక మార్పులు చేసుకోవడమో చేయాలి. లేదంటే అక్షయ్ కుమార్ సర్ఫిరా, సెల్ఫీ, బచ్చన్ పాండేలాగా చేదు ఫలితాన్ని చవి చూడాల్సి రావొచ్చు. నిదానమే ప్రధానం సూత్రం రీమేకుల విషయంలో అస్సలు పనికిరాదు.

This post was last modified on July 27, 2024 10:36 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

2 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago