ఇంటికెళ్లిపోతానంటూ గత వారం ‘బిగ్‍బాస్’ని వేడుకున్న గంగవ్వకు డాక్టర్లు ఏమి మందులిచ్చారో తెలియదు కానీ అప్పట్నుంచీ యమా ఎనర్జీతో ఆటాడేస్తోంది. శని, ఆదివారం ఎపిసోడ్లలో నాగార్జున ఎదుట కూడా అదే పనిగా లొడలొడా మాట్లాడుతూనే వుంది. హౌస్‍లోని వాళ్లంతా సేఫ్ గేమ్ ఆడుతూ తనను హీరో అంటూ సింహాసనంపై కూర్చోబెట్టారు.
ఇక ఈవారం ఆమెను ఫిజికల్ టాస్క్లో కూడా ఇన్‍వాల్వ్ చేస్తే ‘నాకెందుకు వచ్చిందిలే’ అంటూ ఒక మూలన కూర్చోకుండా తనవంతు గేమ్ ఆడేసింది. దివిని రోబోలు కిడ్నాప్ చేయడానికి గంగవ్వ నటన కారణమయింది. ఇక తన రోబో సూట్‍ని మోనాల్ లాక్కుని పోతే అది తెచ్చుకోవడమే కాకుండా… నాది పట్టుకుపోతావా అంటూ కుర్చీ ఎత్తి ఆమెపై విసిరేసింది. అవ్వకు దెబ్బలు తగులుతాయేమోనని ఆమెతో జాగ్రత్తగా వుంటూ వుంటే తాను మాత్రం కయ్యాలకు కూడా కాలు దువ్వేస్తోంది.
ఈ వారానికి ఆమెను కెప్టెన్‍గా కూడా ఎన్నుకున్నారట బిగ్‍బాస్ హౌస్‍మేట్స్. అభిజీత్ మరోసారి కెప్టెన్ అయ్యే ఛాన్స్ వదిలేసుకుని గంగవ్వకు కెప్టెన్సీ ఇచ్చాడు. ఈవారం నామినేషన్లలో ఆమెను ఎలాగో నిలబెట్టలేదు. వచ్చే వారం ఆమెను నామినేట్ చేయడానికి లేదు. కనుక గంగవ్వ మరో రెండు వారాల పాటయితే హ్యాపీగా హౌస్‍లో వుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్‍లో స్వాతి దీక్షిత్ అనే నటి వైల్డ్ కార్డ్ గా హౌస్‍లోకి అడుగు పెడుతోంది.
This post was last modified on September 25, 2020 3:44 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…