మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడున్న అగ్ర దర్శకులెవరూ ఇంతకుముందు పని చేయలేదు. రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వగైరా దర్శకులతో చిరంజీవి వర్క్ చేయలేదు. సురేందర్‍తో సైరా చేసినా కానీ అతడిని అగ్ర దర్శకుల కోటాలో వేయలేం. ఆ సినిమా వరకు చిరంజీవే కెప్టెన్. కొరటాల శివతో ఆచార్య చేయడంతోనే చిరంజీవికి ఇప్పటి అగ్ర దర్శకుల పని తీరు ఎలా వుంటుందనేది తెలిసి వచ్చింది. ఈ సినిమాకి వచ్చేసరికి చిరంజీవికి మాత్రమే నిర్ణయాధికారాలు లేవు.
కొరటాల శివ తన సినిమాలనెప్పుడూ తన కంట్రోల్‍లోనే పెట్టుకుంటాడు. నిర్మాత ఎవరయినా కానీ వ్యాపార లావాదేవీలు కూడా తనే చూసుకుంటాడు. ఆచార్యకు మొదట చరణ్ కూడా నిర్మాత అయినప్పటికీ తర్వాత పూర్తిగా కొరటాల మిత్రుడైన నిరంజన్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. తన సెట్లో తనే కెప్టెన్ అన్నట్టుండే చిరంజీవికి ఇక్కడ కొత్త అనుభవం ఎదురు కావడంతో తనకు కన్వీనియంట్‍గా వుండే దర్శకులతోనే పని చేయాలని డిసైడ్ అయ్యారట.
అందుకే లూసిఫర్ రీమేక్ వినాయక్ చేతికి వెళ్లగా, వేదళాం రీమేక్‍తో మెహర్ రమేష్‍కి మళ్లీ బ్రేక్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ వర్కింగ్ స్టయిల్ కంఫర్టబుల్‍గా వున్నట్టయితే బహుశా చిరంజీవి ఈ వయసులో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఈతరం దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపించకపోవచ్చు.
This post was last modified on September 25, 2020 3:46 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…