టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన కథానాయకుల్లో సమంత ఒకరు. ‘ఏమాయ చేసావె’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో తెలుగు తెరకు పరిచయం అయిన సామ్.. ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా తెలుగులో బిజీ హీరోయిన్లలో ఒకరైపోయింది. పదేళ్లకు పైగా స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద సినిమాలు చేసింది.
ఐతే పెళ్లి.. విడాకులు.. అనారోగ్యం.. ఇలా కొన్ని దశల తర్వాత ఆమె కెరీర్ జోరు తగ్గింది. వయసు పెరిగాక ఏ హీరోయిన్‌కైనా అవకాశాలు తగ్గడం మామూలే కానీ.. సమంతకు దాన్ని మించిన సమస్యలు ఎదురయ్యాయి. అనారోగ్యానికి చికిత్స కోసం గ్యాప్ తీసుకున్నాక ఆమె అవకాశాలు దాదాపు ఆగిపోయిన పరిస్థితి. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ పేరుతో స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా అనౌన్స్ చేసినా.. అది ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో సమంత పునరాగమనం ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఐతే సినీ పునరాగమనం ఆలస్యం అయ్యేలా ఉంది కానీ.. ఈలోపు సామ్ వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె బాలీవుడ్లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటాడెల్’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ సిరీస్‌లతో ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాజ్-డీకే దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. హాలీవుడ్లో ఇదే పేరుతో తెరకెక్కిన ఒరిజినల్‌కు ఇది ఇండియన్ వెర్షన్. షూట్ ఎప్పుడో పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమై ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. ఐతే ఎట్టకేలకు డేట్ ఫిక్సయినట్లు కనిపిస్తోంది.
రాజ్-డీకే ట్విట్టర్లో ‘01.08’ అని ఉన్న పోస్టర్ ఒకటి షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా తేనె డబ్బా, కుందేలు బొమ్మలున్న ఎమోజీలు జోడించారు. ఇవి ‘సిటాడెల్’ లీడ్ రోల్స్ అయిన హనీ, బన్నీలకు సంకేతాలు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 1న ‘సిటాడెల్’ రాబోతున్నట్లే అని సామ్ ఫ్యాన్స్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
This post was last modified on July 26, 2024 9:42 am
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…