ఎవరో జ్వాలలు రగిలించారు, దానికి వేరెవరో ఇబ్బంది పడ్డారని తండేల్ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అధికారికంగా డిసెంబర్ 20 విడుదల తేదీని ఎప్పుడో ప్రకటించుకున్న గీతా ఆర్ట్స్ 2 ఇప్పుడు దానికి కట్టుబడలేని ఇరకాటంలో పడింది. గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని దిల్ రాజు చెప్పాక ఒక్కసారిగా ఆ నెల తాలూకు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకవేళ పుష్ప 2 ది రూల్ కనక మాట తప్పకుండా డిసెంబర్ 6నే వస్తే మిగిలిన వాటికి స్కోప్ ఉండదు. బన్నీ తర్వాత రెండు వారాల గ్యాప్ తో రామ్ చరణ్ దిగుతాడు కాబట్టి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ మధ్య నలిగిపోవాలని ఎవరూ కోరుకోరు.
అదే జరిగితే తండేల్ కున్న ఆప్షన్లు రెండు. ఒకటి నవంబర్ కు మార్చుకోవడం. కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకు అదంత సేఫ్ సీజన్ కాదు. అక్టోబర్ టైట్ గా ఉంది. ఒకవేళ సంక్రాంతికి వెళదామా అంటే అక్కడేమో ముందు చిరంజీవి విశ్వంభర ఉంది. ఆయన బొమ్మ పెట్టుకుని తండేల్ నిర్మాత అల్లు అరవింద్ ఎదురెళ్ళే రిస్క్ తీసుకోరు. అలా చేస్తే సోషల్ మీడియా ఫ్యాన్స్ తో లేనిపోని నెగటివిటీ వస్తుంది. ఇది కాకుండా రవితేజ – భాను భోగవరపు, వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమాలు ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. బాలయ్య 109 కూడా పండగ వైపే చూస్తోందట. దర్శకుడు బాబీ ప్లానింగ్ ని బట్టి తేదీ నిర్ణయించబోతున్నారు.
ఇంత సంకటం మధ్య తండేల్ షూటింగ్ అయితే ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరిగిపోతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంట మీద భారీ అంచనాలున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. పాకిస్థాన్ లో సగభాగం జరిగే ఈ కథలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని పొందుపరిచారు. వరస డిజాస్టర్లతో సతమతమైన చైతు ఈసారి గురి తప్పకూడదనే ఉద్దేశంతో తండేల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో స్వయంగా పాల్గొన్నాడు. నెలల తరబడి దానికోసమే కేటాయించాడు. చివరికి తండేల్ రిలీజ్ డేట్ కథ ఏ కంచికి చేరుతుందో ఇంకా వేచి చూడాలి.
This post was last modified on July 26, 2024 2:38 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…