Movie News

నిజమైన సింహంతో ప్యాన్ ఇండియా సినిమా

దగ్గుబాటి రానాతో అరణ్య తీసిన దర్శకుడు ప్రభు సాల్మన్ గుర్తున్నాడా. ఇతనిది చాలా విలక్షమైన శైలి. ప్రకృతి, అడవులు, జంతువులు లేకుండా ఏ సినిమా ఉండదు. మైనా (తెలుగు ప్రేమఖైది) తో సాల్మన్ పేరు మనకూ పరిచయమయ్యింది.

తర్వాత గజరాజులో ఏకంగా ఏనుగుని తీసుకొచ్చి ఫుల్ లెన్త్ మూవీ చేశాడు. అరణ్య ఆడలేదు కానీ నేచర్ మీద అతనికున్న ఆరాధనాభావం ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇప్పుడు ఏకంగా మాంబో అంటూ నిజమైన సింహంతో సినిమా తీయడం సంచలనం రేపుతోంది. ఏషియాలో ఇలా రియల్ లయన్ తో తీసిన మొట్టమొదటి సినిమాగా మాంబో నిలవబోతోంది.

దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్నేహం కోసం, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా మనకు సుపరిచితుడైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మనవడు విజయ్ శ్రీహరి దీంతో పరిచయం కాబోతున్నాడు. అంటే వనిత కొడుకన్న మాట.

ఇంకా చెప్పాలంటే నరేష్ ఆ మధ్య తీసిన మళ్ళీ పెళ్లిలో ఆయన భార్యగా నటించింది ఈవిడే. ఈ మాంబోలో ఒక మనిషికి క్రూర జంతువుకి మధ్య ఏర్పడే స్నేహం ఆధారంగా తీశారు. షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందట. ఇలా నిజ జంతవులను వాడేందుకు మన అటవీ చట్టాలు ఒప్పుకోవు కాబట్టి విదేశాల్లో షూట్ చేసినట్టు సమాచారం.

గతంలో తెలుగులోనూ మృగరాజు లాంటి ప్రయత్నాలు చేశారు కానీ అందులో అధిక శాతం గ్రాఫిక్ సింహాలే ఉంటాయి. కొన్ని సీన్లు మాత్రం సౌత్ ఆఫ్రికాలో నిజమైన సింహాలతో తీశారు. మాంబోని తమిళం, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజయ్యింది.

కమర్షియల్ ఫార్ములాతో నాలుగు డబ్బులు వెనకేసుకుందామనే ట్రెండ్ లో ఉన్న డైరెక్టర్లకు భిన్నంగా ప్రభు సాల్మన్ ఇలా ప్రకృతిని ఇంతగా తెరమీద చూపించాలని తాపత్రయపడటం విచిత్రమే. ఇకపై కూడా ఈ బాటను విడవనని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు.

This post was last modified on July 26, 2024 2:31 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

5 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

10 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 hours ago