ఒకప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో నటిస్తే హీరోయిన్ల దశ తిరిగినట్లే అని పేరుండేది. కథానాయికలను చాలా అందంగా చూపించి వారి రాత మార్చేస్తాడని ఆయనకు పేరుండేది. ఆ తర్వాతి కాలంలో రాఘవేంద్రరావు శిష్యుల్లో ఒకరైన వైవీఎస్ చౌదరి కూడా ఇలాంటి గుర్తింపే సంపాదించాడు. ఈ తరంలో కొంతమేర ఇలాంటి ఇమేజ్ ఉన్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.
‘మిరపకాయ్’లో నటించిన రిచా గంగోపాధ్యాయ, ‘గబ్బర్ సింగ్’లో చేసిన శ్రుతి హాసన్, ‘దువ్వాడ జగన్నాథం’లో నటించిన పూజా హెగ్డే తర్వాతి కాలంలో ఎంత బిజీ అయ్యారో తెలిసిందే. ‘గద్దలకొండ గణేష్’లో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ హయతి సైతం తర్వాత వరుసగా ఛాన్సులు అందుకుంది. ఇప్పుడు హరీష్ కొత్త హీరోయిన్ కూడా ఇలాగే బిజీ అయ్యేలా కనిపిస్తోంది. హరీష్ కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బోర్సే అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మేకింగ్ దశలో ఉండగానే ఈ అమ్మాయి లుక్స్ గురించి చర్చ జరిగింది.
ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక్కో ప్రోమో రిలీజ్ చేస్తున్న కొద్దీ తనకు క్రేజ్ పెరిగిపోతోంది. సితార్ సాంగ్‌లో భాగ్యశ్రీ అందాలు ఎంతగా హైలైట్ అయ్యాయో తెలిసిందే. టాలీవుడ్లోకి మరో ఇలియానా వచ్చేసిందనే చర్చ జరిగింది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ పేరు మార్మోగుతున్న ఈ టైంలో ఆమెకు ఒక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లు వార్తలొస్తున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నారట. ముందు ఈ సినిమాకు శ్రీలీలను అనుకున్నారు. తర్వాత ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. తన స్థానంలోకి భాగ్యశ్రీ వస్తుందని కొన్ని రోజుల ముందే చర్చ జరిగింది. ఇప్పుడు ఆ విషయమే నిజమైంది. విజయ్-గౌతమ్ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీనే ఖరారు చేశారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అభిమానులు సంయమనం పాటించాలని, త్వరలోనే అధికారికంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తామని టీం ప్రకటించింది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం.
This post was last modified on July 25, 2024 2:49 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…