యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్.. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్‌లో కూడా సందడి చేస్తుంటుంది. మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీలో తన పేరు మీదే రాసిన ఓ పాటలో ఆమె తళుక్కుమన్న సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది.
ఐతే గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో తనకు ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినా తిరస్కరించారని ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెబితే ఆమెను బాగా ట్రోల్ చేశారు నెటిజన్లు. పవన్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే నో చెప్పావా.. ఇది నిజమేనా అంటూ కౌంటర్లు వేశారు. కానీ ఏ గుర్తింపూ రాని అలాంటి పాటల్లో నటించడం ఇష్టం లేకే నో చెప్పినట్లు అనసూయ చెప్పుకుంది.
కట్ చేస్తే అప్పుడు మిస్సయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో డ్యాన్స్ చేసే అవకాశాన్ని పట్టేసిందట అనసూయ. తాజాగా ఒక టీవీ షోలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. పవన్ కళ్యాణ్‌తో తాను అదిరిపోయే డ్యాన్స్ నంబర్ చేశానని.. శ్రీముఖి హోస్ట్ చేసే ఒక టీవీ షోలో అనసూయ వెల్లడించింది. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా అరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అనసూయ పవన్ నటించే ఏ చిత్రంలో డ్యాన్స్ నంబర్ చేసిందన్నది ఆసక్తికరం.
పవన్ నటిస్తున్న మూడు చిత్రాలు మధ్యలో ఆగాయి. అవే.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఉస్తాద్ షూట్ కొంచెమే జరిగింది. హరిహర వీరమల్లు లాంటి చారిత్రక చిత్రంలో డ్యాన్స్ నంబర్ ఉందా అన్నది డౌట్. బహుశా ఓజీలోనే ఈ డ్యాన్స్ నంబర్ ఉండొచ్చేమో.
This post was last modified on July 25, 2024 6:51 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…