Movie News

థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్

కొన్ని సినిమాలు థియేటర్లలో ఉండగా జనం పెద్దగా పట్టించుకోరు. అవి ఏదో మొక్కుబడిగా ఆడేసి వెళ్లిపోతుంటాయి. కానీ అవే చిత్రాలను ఓటీటీలో బాగా ఆదరిస్తారు. మంచి సినిమానే కదా.. ఎందుకు ఆడలేదు అని ఆశ్చర్యపోతారు. ఈ కోవలో చాలా చిత్రాలే ఉన్నాయి. ఇప్పుడు సుధీర్ బాబు చిత్రం ‘హరోంహర’ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

గత నెలలో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనపుడు జనం లైట్ తీసుకున్నారు. డబ్బింగ్ మూవీ అయిన మహారాజకే పట్టం కట్టారు. దాని జోరు ముందు సుధీర్ మూవీ నిలవలేకపోయింది. కొంతమేర ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అంతిమంగా ఆశించిన ఫలితం రాలేదు. తొలి వీకెండ్ తర్వాత హరోంహర గురించి డిస్కషనే లేదు. ఐతే ఇటీవలే హరోంహర అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్‌గా రిలీజైంది.

ఇలా విడుదలైన దగ్గర్నుంచి ‘హరోంహరకు రెస్పాన్స్ అదిరిపోతోంది. మినీ కేజీఎఫ్ తరహాలో అనిపించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నట్లు అమేజాన్ ప్రైమ్ ప్రకటించింది.

అక్కడ పెద్ద పెద్ద సినిమాలకు దీటుగా ఆదరణ తెచ్చుకుంటోంది హరోంహర. బహు భాషల ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాలో సన్నివేశాల గురించి చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు.. సినిమాలో చూపించిన గన్ కల్చర్ మీద చర్చ జరుగుతోంది. దర్శకుడు జ్ఞానశేఖర్ ప్రతిభను.. అలాగే సుధీర్ బాబు నటనను అందరూ కొనియాడుతున్నారు. సినిమాను సరిగా ప్రమోట్ చేసి ఉంటే థియేటర్లలో కూడా బాగా ఆడేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on July 24, 2024 5:05 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

55 minutes ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago