సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. తలైవర్ ని ఎప్పుడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తానని లోకేష్ అన్న మాటలకు తగట్టుగా అభిమానులకు దీని మీద మాములు అంచనాలు లేవు. ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో బలమైన కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా ఇతని మీద తమిళ తంబీల ఆశలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా క్యాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్న లోకేష్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను నాగార్జునని అడిగారట.
నిజానికి రెండు మూడు నెలల క్రితమే లోకేష్ నాగ్ ని వ్యక్తిగతంగా కలిసిన మాట నిజమే. ఫోటో కూడా బయటికి వచ్చింది. కానీ అది కూలి కథ చెప్పడానికని ఫ్యాన్స్ ఊహించలేదు. తీరా చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. రజని, నాగ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటించలేదు కానీ ఒకే కథతో వేర్వేరుగా రెండు భాషల్లో శాంతి క్రాంతి చేశారు. అది డిజాస్టర్ కావడం వేరే సంగతి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అభిమానులు కలగంటున్న కాంబినేషన్ ని లోకేష్ కనక నిజం చెయ్యగలిగితే అంతకన్నా కోరుకునేది ఏముంటుంది. అన్నపూర్ణ వర్గాలు మాత్రం నాగార్జున సానుకూలంగా ఉన్నారనే చెబుతున్నాయి.
అధికారిక ప్రకటన వచ్చే దాకా వెయిట్ చేయడం తప్ప ఇప్పటికిప్పుడు ఖరారుగా చెప్పలేం కానీ కూలిలో ఇలాంటి సర్ప్రైజ్ లు బోలెడు ప్లాన్ చేశాడట లోకేష్. బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ ని అడిగాడనే టాక్ ఉంది. ఇదీ కూడా ఓకే అయితే స్కేల్ ఓ రేంజ్ లో పెరుగుతుంది. సీనియర్ హీరోయిన్ శోభన ఇందులో నటించబోతున్నారు. దళపతిలో రజనితో ఆమె కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో చూశాం. కేవలం ప్రియురాలిగా కొంత భాగమే కనిపించినా అలా గుర్తుండిపోయారు. కూలిలో ఇలాంటి ఆకర్షణలు చాలానే ఉంటాయట. అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో అట్రాక్షన్ గా నిలవనుంది.
This post was last modified on July 24, 2024 10:44 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…