మొన్నటిదాకా సోషల్ మీడియాని షేక్ చేసిన పుష్ప 2 వ్యవహారం మెల్లగా కొలిక్కి వస్తోంది. హఠాత్తుగా అల్లు అర్జున్ గెడ్డం తీసేయడంతో మొదలైన ఇష్యూ సుకుమార్ విదేశాలకు వెళ్లడం దాకా రకరకాల కథనాలను ప్రచారంలోకి తెచ్చింది. ఆయ్ ఈవెంట్లో బన్నీ వాస్ వీటికి వీలైనంత మేరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా నార్వేలో ఉన్న ఐకాన్ స్టార్ అవసరం లేని ఎపిసోడ్లను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయబోతున్నారు. ఫహద్ ఫాసిల్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలిసింది. పోలీస్ స్టేషన్ సీన్లతో పాటు అనసూయ, సునీల్ తదితరుల కాంబో ఉండొచ్చని వినికిడి.
డిసెంబర్ 6 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే లక్ష్యంతో ఉన్న పుష్ప టీమ్ నిజంగా దాన్ని నిలబెట్టుకుంటుందా లేదానే దాని గురించి ఇంకా ఊహాగానాలు ఆగలేదు. ఎందుకంటే స్పెషల్ సాంగ్ బ్యాలన్స్ ఉంది. ఏ హీరోయిన్ లాక్ అవ్వలేదు. జాన్వీ కపూర్ పేరు వినిపించినా ఆ దిశగా సూచనలు కనిపించడం లేదు. కీలకమైన క్లైమాక్స్ ని సుకుమార్ ఎన్ని రోజుల్లో ప్లాన్ చేసుకున్నారో తెలియదు. బన్నీ వచ్చాక షూట్ చేస్తారు కానీ డిసెంబర్ అయిదు నెలల దూరంలో ఉన్న నేపథ్యంలో ప్రతి రోజూ సవాల్ గానే మారనుంది. అయితే అంతా సాఫీగా జరిగిపోయేలా ప్లానింగ్ జరుగుతోందని టాక్.
గేమ్ చేంజర్ డిసెంబర్ మూడో వారంలో రావడం ఖరారు కావడంతో పుష్ప 2 అదే నెలలో ఇంకో డేట్ తీసుకోవడానికి లేకుండా పోయింది. పొరపాటున పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఇంకో మూడు నాలుగు నెలలు ఆగాల్సి వస్తుంది. ఇది తెలిసే మైత్రి మేకర్స్ వీలైనంత మేరకు టార్గెట్ చేరుకునేలా సర్వం సమకూరుస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2లో జగపతిబాబు లాంటి కొత్త ఆర్టిస్టులు చాలానే తోడయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. కల్కి 2898 ఏడి, దేవర తర్వాత ఆ స్థాయి బజ్ వచ్చేది పుష్ప 2 మీదేనని నార్త్ బయ్యర్లు సైతం నమ్మకంగా ఉన్నారు.
This post was last modified on July 23, 2024 4:10 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…