మాములుగా షో నడుస్తున్నప్పుడే వివాదాలకు నెలవుగా నిలిచే హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో మరోసారి తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. జియో సినిమా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో నుంచి కొద్దిరోజుల క్రితం ఒక వీడియో చక్కర్లు కొట్టింది. అందులో అర్మాన్, కృతిక మాలిక్ పడక మీద చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. బూతు సైతం సిగ్గుపడేలా ఇలాంటివి ఎలా పొందుపరుస్తారని నెటిజెన్లు భగ్గుమన్నారు. పలు రాజకీయ నాయకులు అత్యవసరంగా షోని ఆపాల్సిందిగా కోర్టు కేసులు వేసేందుకు సిద్ధపడ్డారు. దీనికి నిర్మాతలు స్పందించారు.
అసలిది ఒరిజినల్ వీడియో కాదని, ఎవరో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో నైతికతను విస్మరించే ప్రసక్తే లేదని జియో సినిమా తరఫున ఒక ప్రకటన విడుదలయ్యింది. అసలు తమ షోలో అలాంటి వాటికి తావే లేదని పేర్కొన్నారు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వ్యవహారం దూరం వెళ్లిపోయింది. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ టీవీలో బిగ్ బాస్ చేస్తున్నప్పుడే కొందరు ఓవర్ చేసి హద్దులు దాటిన వ్యవహారాలు చేశారు. అలాంటిది స్టార్ల పర్యవేక్షణ ఉండని ఓటిటి బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. జియో మాత్రం డ్యామేజ్ రిపేర్ పనులు చేపట్టింది.
ఎంత ఎంటర్ టైన్ చేయడం కోసమే అయినా బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా చేయడం ఏం బాలేదని వీరాభిమానులు సైతం అంటున్నారు. అయితే జియో ప్రతినిధులు మాత్రం కుట్రని దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే పట్టుకుంటామని పేర్కొంటున్నారు. ఇప్పటికైతే ఇష్యూ సద్దుమణిగింది కానీ మళ్ళీ ఎవరైనా బలమైన ఆధారాలు చూపిస్తే తప్ప స్పష్టత రాదు. తెలుగులో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. నాగార్జున యాంకర్ గా కొనసాగుతూ ఎనిమిదో సీజన్ ని అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. పైన చెప్పినంత తీవ్రంగా మన బిగ్ బాస్ లో అయితే ఎప్పుడూ జరగలేదు. జరగబోదు కూడా.
This post was last modified on July 23, 2024 3:26 pm
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…