‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చిన్నతనంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ సంపాదించిన అమ్మాయి అవికా గోర్. ఆ తర్వాత ఆమె తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ మూవీతో కథానాయికగా మారింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఒక దశలో బాగా బొద్దుగా తయారై హీరోయిన్ పాత్రలకు సరిపోనట్లుగా కనిపించిన అవికా.. మధ్యలో బ్రేక్ తీసుకుని నాజూగ్గా తయారైంది. తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు పెరిగాయి.
ఇప్పుడు పలు చిన్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అవికా.. ‘బ్లడీ ఇష్క్’ అనే కొత్త చిత్రంతో త్వరలోనే పలకరించబోతోంది. ఇది ప్రేమకథా చిత్రం కావడంతో తన వ్యక్తిగత జీవితంలో లవ్ గురించి కూడా మీడియా ముందు ఓపెనైంది అవికా. మిలంద్ చాంద్వానీ అనే తన స్నేహితుడితో అవికా కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఫియాన్సీ గురించి ఆమె మాట్లాడింది.
“కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు మిలంద్ పరిచయం అయ్యాడు. దాదాపు ఆరు నెలల పాటు మేం స్నేహితులుగా ఉన్నాం. అతడే నాకు మొదట ప్రపోజ్ చేశాడు. ఇష్టాయిష్టాలు కలిశాయి. నా అభిప్రాయాలను అతను ఎంతో గౌరవిస్తాడు. అదే అతడి మీద ఇష్టం పెరిగేలా చేశాడు. అందుకే లవ్ ప్రపోజల్ చెప్పగానే ఓకే చెప్పా. మా మనసులు కలిశాయి. నా దృష్టిలో మానసికంగా మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. పెళ్లి గురించి మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సమయం వచ్చినపుడు అది జరుగుతుంది. మా ఇద్దరి మధ్య వయసు అంతరం ఎక్కువ ఉంది. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన పరిణామం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని మిలంద్ చెప్పాడు. అందుకే దాని గురించి ఆలోచిస్తున్నా” అని అవికా వెల్లడించింది.
This post was last modified on July 22, 2024 10:52 pm
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…