Movie News

అంతకు మించి కావాలంటున్న కంగువ

సూర్య మొదటి ప్యాన్ ఇండియా మూవీ కంగువ అక్టోబర్ 10 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. తెలుగు వెర్షన్ డబ్బింగ్ హక్కులు ఇంకా అమ్మలేదని ట్రేడ్ టాక్. నిర్మాత జ్ఞానవేల్ రాజా ముప్పై కోట్లకు మించి రేట్ ఆశిస్తున్నారని, ట్రైలర్ లో విజువల్స్ చూశాక ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. కొందరు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చూపించిన కొన్ని విజువల్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయట. యాక్షన్ ఎపిసోడ్స్, భూత వర్తమాన కాలాలకు సంబంధించి ఎన్నో ఊహించని పాత్రలు పొందుపరిచారట.

కంగువతో రజనీకాంత్ వెట్టయాన్ క్లాష్ అయ్యే సూచనలు ఉండటంతో సూర్య టీమ్ ముందస్తుగా ప్రమోషన్లు వేగవంతం చేసే ప్లాన్ లో ఉంది. రిలీజ్ ఇంకా బోలెడు టైం ఉన్నప్పటికీ ఒక ప్రణాళిక ప్రకారం పబ్లిసిటీని సిద్ధం చేస్తోంది. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలు, అవుట్ డోర్ కార్యక్రమాలు ఇలా చాలానే సెట్ చేస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధం కావడం ఆలస్యం సూర్య ప్రత్యేకంగా నెల రోజుల దాకా కాల్ షీట్స్ కేటాయించబోతున్నట్టు తెలిసింది. యువి నిర్మాణ భాగస్వామ్యం ఉండటంతో తెలుగులోనూ భారీ సంఖ్యలో థియేటర్లు దక్కబోతున్నాయి. బయ్యర్లు ఫిక్స్ అయితే స్క్రీన్ల కేటాయింపు జరుగుతుంది.

ఫైనల్ గా కంగువకు తెలుగులో ఎంత బిజినెస్ ఆశిస్తున్నారో తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. సూర్య ఇటీవలే నిర్మాతగా సర్ఫిరా రూపంలో డిజాస్టర్ చవిచూశాడు. అక్షయ్ కుమార్ తో ఆకాశం నీ హద్దురాని రీమేక్ చేయడం తగిన మూల్యం చెల్లించేలా చేసింది. సూర్య హీరో కాదు కాబట్టి ఇబ్బందేం లేదు కానీ కంగువ హిందీ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే తరచు సూర్య, జ్యోతికలు ముంబై మీడియాతో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నారు. రోలెక్స్ తో సహా పలు షాక్ ఇచ్చే విషయాలు కంగువలో చాలా ఉంటాయట. శివ దర్శకత్వం, దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు,.

This post was last modified on July 22, 2024 3:41 pm

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

2 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

4 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

4 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

5 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

5 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

6 hours ago