‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి నభా నటేష్. ఆ చిత్రంలో క్యూట్‌గా కనిపించడంతో పాటు పాత్రకు తగ్గట్లు చక్కగా నటించి మెప్పించింది నభా. నిజానికి ‘నన్ను దోచుకుందువటే’ సరిగా ఆడకపోయినా నభాకు ఛాన్సులకైతే లోటు లేకపోయింది. ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, అల్లు అదుర్స్.. ఇలా వరుసగా మిడ్ రేంజ్ సినిమాలతో దూసుకెళ్లింది నభా. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ మినహా సినిమాలన్నీ నిరాశపరచడంతో ఆమె కెరీర్ స్లో అయింది. దీనికి తోడు యాక్సిడెంట్ తన కెరీర్‌కు పెద్ద బ్రేక్ వేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులు నభాను మరిచిపోయారు. రోడ్డు ప్రమాదం తాలూకు గాయాల నుంచి కోలుకుని ఏడాది కిందటే మామూలు మనిషైనప్పటికీ.. వెంటనే ఛాన్సులు రాలేదు.
చాలా రోజులు ఎదురు చూశాక ‘డార్లింగ్’ అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. అంతకుముందు స్టార్లతో సినిమాలు చేసిన నభా.. ప్రియదర్శి లాంటి చిన్న హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఐతే ‘డార్లింగ్’లో కథానాయిక పాత్రే కీలకం కావడం, అది పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నభా ఓకే అన్నట్లుంది. ఈ సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ ఘనంగా మొదలవుతుందని నభా ఆశించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. పూర్తి నెగెటివ్ టాక్‌తో మొదలైన ‘డార్లింగ్’ మినిమం ఇంపాక్ట్ వేయలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోయింది. వీకెండ్లోనే జనం థియేటర్లకు రాలేదు.
కొన్నిసార్లు సినిమా ఫెయిలైనా ఆర్టిస్టులకు పేరొస్తుంటుంది. నభా పాత్ర ప్రకారం చూస్తే తనకు మంచి గుర్తింపే రావాలి. కానీ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్రలో నభా నటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. మంచి పెర్ఫామర్ చేయాల్సిన పాత్రలో నభా తేలిపోయిందని.. ఆమే సినిమాకు పెద్ద మైనస్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. నటిగా నభా బలహీనతలన్నీ ఈ సినిమాలో బయటపడిపోయాయి. మరోవైపు మధ్యలో గ్యాప్ వల్లో ఏమో నభా లుక్స్ కూడా మారిపోయాయి. సినిమాలో ఆమె ఆకర్షణీయంగా కనిపించలేదు. దీంతో ఆ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చేసింది చిన్న సినిమా. అది డిజాస్టర్ అయింది. పైగా నటన, లుక్స్ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇలాంటి రీఎంట్రీని నభా అస్సలు ఊహించి ఉండదేమో పాపం.
This post was last modified on July 22, 2024 3:38 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…