చాలా తక్కువ గ్యాప్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం సహజమే కానీ అవి తండ్రి కొడుకులవి కావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. 2016 డిసెంబర్ 9 రామ్ చరణ్ ధృవ రిలీజయ్యింది. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించగా ఘనవిజయం అందుకుంది. నెల తిరగడం ఆలస్యం 2017 జనవరి 11 సంక్రాంతి కానుకగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది మెగాస్టార్ కంబ్యాక్ మూవీ కావడంతో పాటు మాస్ జనాలు మెచ్చేలా కంటెంట్ ఉండటంతో సూపర్ హిట్ కొట్టేశారు. ఇప్పుడు వర్తమానానికి వద్దాం.
డిసెంబర్ లో గేమ్ చేంజర్ వస్తుందని నిన్న దిల్ రాజు అధికారికంగా చెప్పేశారు. అంటే 20న దాదాపు రావడం కన్ఫర్మ్. క్రిస్మస్ కానుక అన్నారు కానీ అంతకన్నా అయిదారు రోజుల ముందు వస్తేనే దాని ప్యాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టు సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే సరిగ్గా ఇరవై రోజులకు జనవరి 10న చిరంజీవి విశ్వంభర సంక్రాంతి థియేటర్లలో ఉంటుంది. స్కేల్ ప్రకారం చూసుకుంటే కేవలం మూడు వారాల గ్యాప్ అనేది తక్కువే అయినప్పటికి ఇంత కన్నా వేరే ఆప్షన్ లేదు. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని మళ్ళీ దండ్రి కొడుకుల హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇంతకన్నా మెగా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. ప్రస్తుతానికి వీటి రిలీజ్ ప్లాన్లలో ఎలాంటి వాయిదాలు, మార్పులు ఉండబోవడం లేదు. గేమ్ చేంజర్ కు సంబంధించి చరణ్ అవసరం లేని పది రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వేగం పెంచబోతున్నారు. ఇక విశ్వంభర దాదాపు కొలిక్కి వచ్చింది. ఇంట్రో సాంగ్, క్లైమాక్స్ అయిపోతే గుమ్మడికాయ కొట్టేసి నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుపెడతారు. సో ఎలా చూసుకున్నా చిరు చరణ్ ఇద్దరూ నెల కంటే తక్కువ గ్యాప్ లో రావడం ఖరారుగానే కనిపిస్తోంది. అభిమానులు కోరుకున్నట్టు సెంటిమెంట్ రిపీటవుతుందా చూడాలి.
This post was last modified on July 22, 2024 10:40 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…