Movie News

దేవర ట్విస్టు చెప్పిన జాన్వీ కపూర్

సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 పట్ల అభిమానులు ఎంత ఆత్రంగా ఉన్నారో చూస్తున్నాం. ఇప్పటికే ఫియర్ సాంగ్ ఊహించిన దానికన్నా పెద్ద ఛార్ట్ బస్టర్ అయ్యింది. అనిరుధ్ రవిచందర్ మిగిలిన పాటలనూ అంతకు మించిన స్థాయిలో ఇచ్చి ఉంటాడని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి రెండో లిరికల్ ఆడియో ప్రకటన ఈపాటికి వచ్చి ఉండాలి. కానీ ఇంకా పని పూర్తవ్వని కారణంగా అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంచారట. ఇందులో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ తన బాలీవుడ్ మూవీ ఉలజ్ ప్రమోషన్లలో భాగంగా దేవర ముచ్చట్లను పంచుకుంది.

బీచ్ ఒడ్డున ఆడిపాడుతూ రొమాన్స్ చేస్తూ తన పాత్ర సరదాగా ఉంటుందని అయితే మొదటి భాగం కంటే దేవర 2లోనే క్యారెక్టర్ ఎక్కువగా రివీలవుతుందని అసలు ట్విస్టు బయట పెట్టింది. అంటే ఫస్ట్ పార్ట్ లో పాటల్లో కనిపించినా, సన్నివేశాలు చేసినా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్నది సీక్వెల్ లోనే అని అర్థమైపోతుంది. ఇంతకన్నా డీటెయిల్స్ చెప్పలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సరసన డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నానని మాత్రం హింట్ ఇచ్చింది. ఇంకో పాట షూటింగ్ బాలన్స్ ఉన్న దేవరలో జాన్వీ పాల్గొనాల్సి ఉంది. ఆహార కల్తీ వల్ల ఆసుపత్రిలో చేరి ఇటీవలే డిస్ఛార్జ్ అయ్యింది.

టాలీవుడ్ ఎంట్రీగా దేవర గురించి జాన్వీ కపూర్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. శ్రీదేవి వారసురాలిగా తెలుగులో ప్రవేశించడం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లతో జరగడంతో కెరీర్ పరంగా ఇక్కడ మంచి అవకాశాలు దక్కే సూచనలున్నాయి. ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ కోసం అడిగారనే టాక్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర 1 విడుదలయ్యాక ఇంకో ఏడాది తర్వాత దేవర 2ని సిద్ధం చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు చరణ్, తారక్ షూటింగులతో బిజీ కానుంది.

This post was last modified on July 22, 2024 11:35 am

Share

Recent Posts

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 minutes ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

16 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

1 hour ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

2 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago