Movie News

పిక్ టాక్: కీర్తి సురేష్ మారిపోయింది


కెరీర్ అంతా గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లు లీడ్ రోల్స్ ఆగిపోయాక సంప్రదాయ శైలిలో సాగే అక్క, వదిన పాత్రలకు మారిపోవడం చూస్తుంటాం. అలాగే కెరీర్లో ఒక దశ వరకు ట్రెడిషనల్ రోల్సే చేసే హీరోయిన్లు ఆ తర్వాత గ్లామర్ పాత్రల్లోకి మారడమూ చూడొచ్చు. కెరీర్లో దాదాపు పదేళ్ల పాటు సంప్రదాయ బద్ధంగానే కనిపించిన అనుపమ పరమేశ్వరన్.. ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో ఎంత సెక్సీగా కనిపించిందో తెలిసిందే.

ఇదే బాటలో కీర్తి సురేష్ సైతం ఈ మధ్య బాగానే గ్లామర్ డోస్ పెంచుతోంది. ‘సర్కారు వారి పాట’ సహా కొన్ని చిత్రాల్లో ఆమె గ్లామర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సమయంలో ఆమె మరింత సెక్సీగా తయారవుతోంది. ‘తెరి’ రీమేక్‌ షూట్ సందర్భంగా ఆమె ఆన్ లొకేషన్ ఫొటోలు కొన్ని లీక్ కాగా.. అందులో తన క్లీవేజ్ షో చూసి అందరూ షాకయ్యారు.

ఐతే ఇప్పుడు కీర్తినే స్వయంగా జనాలకు గ్లామర్ డోస్ ఇస్తోంది. తమిళంలో తాను నటించిన ‘రఘు తాత’ అనే చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌కు కీర్తి తయారై వచ్చిన తీర చూసి అందరూ షాకైపోయారు. బ్యాక్ లెస్‌ జాకెట్ వేసుకుని ఆమె చేసిన స్కిన్ షోకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పాటు క్లీవేజ్ అందాల ఫొటోలు కూడా బాగా తిరుగుతున్నాయి.

బాలీవుడ్‌లో అడుగు పెట్టగానే కీర్తి అప్పీయరెన్సే మారిపోయిందని.. తాను నటిస్తున్న సినిమా శైలికి పూర్తి భిన్నంగా ప్రమోషన్లలో కనిపిస్తోందని చెన్నై సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కీర్తి పూర్తిగా మారిపోయిందని.. ‘తెరి’ రీమేక్ రిలీజయ్యాక కీర్తికి కొత్త ఇమేజ్ రావడం ఖాయమని.. మున్ముందు ఆమెను మరిన్ని గ్లామర్ పాత్రల్లో చూడొచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు.

This post was last modified on July 22, 2024 6:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘టెస్ట్’ మ్యాచులో ఓడిపోయిన ప్రేక్షకుడు

ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…

19 minutes ago

బోలెడు శుభవార్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…

46 minutes ago

లెక్కంటే లెక్కే.. బాబు మార్కు పదవుల భర్తీ

నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…

1 hour ago

కాకాణికి టెన్ష‌న్‌.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం!

వైసీపీ మాజీ మంత్రి, కీల‌క నాయ‌కుడు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.…

2 hours ago

రౌడీ కామెంట్.. బయటివారే బాలీవుడ్‌ను బతికిస్తారు

విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ డిజాస్టర్లతో అతను…

2 hours ago

కేతిరెడ్ది గుర్రాలకోట ఏమైంది

అవినీతి మకిలి అంటకుండా సాగితే…అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కడుపులో చల్ల కదలకుండా నిర్భయంగా ఉండొచ్చు. అదే అవినీతిలో నిండా…

3 hours ago