టాలీవుడ్లో ఈ ఏడాది మాస్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. సంక్రాంతికి ‘హనుమాన్’, ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ లాంటి ఈవెంట్ మూవీస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కామెడీ ఎంటర్టైనర్ అయిన ‘టిల్లు స్క్వేర్’ కూడా బాగా ఆడింది. ఐతే ఎప్పట్లా మాస్ సినిమాల మోత మాత్రం లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ఓ మోస్తరుగా హడావుడి చేసింది తప్ప.. మాస్‌ను ఊపేసే సినిమాలేవీ ఈ ఏడాది కనిపించలేదనే చెప్పాలి.
ఐతే కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్లో మాస్ జాతర మొదలు కాబోతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎక్కువగా మాస్ సినిమాలదే హవా కాబోతోంది. ముందుగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మాస్‌ను ఊపేసే సినిమాలే రాబోతున్నాయి. నిజానికి ఆ వీకెండ్లో ‘పుష్ప-2’ రావాల్సింది. అది మాస్ బాగా కనెక్ట్ అయ్యే చిత్రం. కానీ అది వాయిదా పడిపోయింది. అయినా ఇబ్బంది లేదన్నట్లు ఆ డేట్‌ను ఊర మాస్ సినిమాలే వాడుకోబోతున్నాయి.
ఆల్రెడీ రామ్-పూరి జగన్నాథ్‌ల ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది. అది మాస్ ఎంతగానో ఎదురు చూసే సినిమా అనడంలో సందేహం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్‌ను ఒక ఊపు ఊపేసి బ్లాక్‌బస్టర్ అయింది. సీక్వెల్ మీద కూడా ఆ వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆగస్టు 15 రేసులోకి మరో పెద్ద సినిమా వచ్చింది. అదే.. మిస్టర్ బచ్చన్. రవితేజ అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అతడితో హరీష్ శంకర్ జట్టు కట్టడంతో మాస్‌లో భారీ అంచనాలుంటాయి. దీని ప్రోమోలు చూస్తే రవితేజ అభిమానులను అలరించే అంశాలకు ఢోకా ఉండదనిపిస్తోంది. ఈ ఏడాది అనుకున్నంతగా కళకళలాడని మాస్ సెంటర్లలో ఈ రెండు చిత్రాలతో సందడి నెలకొనడం ఖాయం.
ఆగస్టు 15కు ఆయ్, 35 లాంటి చిన్న చిత్రాలు కూడా షెడ్యూల్ అయ్యాయి కానీ.. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ పక్కాగా ఆ రోజు వచ్చేట్లయితే ఇవి వెనక్కి తగ్గబోతున్నట్లే. మరోవైపు ఆగస్టు 15కే రాబోతున్న తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ సైతం మాస్ దృష్టిని బాగానే ఆకర్షించే అవకాశాలున్నాయి.
This post was last modified on July 21, 2024 6:56 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…