Movie News

పుష్ప-2.. ఇక పంచాయితీ ఫాహద్‌తో

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప-2’ గురించి ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబరు 6కు వాయిదా వేయడం పెద్ద నెగెటివ్ న్యూస్. ఆ తర్వాత షూట్ సజావుగా సాగట్లేదని.. సుకుమార్-అల్లు అర్జున్ మధ్య గొడవలని.. డిసెంబరు 6న కూడా సినిమా రావడం కష్టమే అని.. ఇలా రకరకాల ప్రచారాలు సాగాయి.

ఐతే చిన్న విషయాలను పెద్దవి చేస్తున్నారని.. షూటింగ్ విషయంలో ఇబ్బందులేమీ లేవని.. చిన్న గ్యాప్ వచ్చిందని.. మళ్లీ షూట్ మొదలవుతుందని.. అనుకున్న ప్రకారమే సినిమాను పూర్తి చేసి డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అతి త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉంది. అందులో వెంటనే అల్లు అర్జున్ పాల్గొనడని.. వేరే ఆర్టిస్టుల మీద కీలక సన్నివేశాలు తీయాల్సి ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ఐతే ఈ షెడ్యూల్లో విలన్ ఫాహద్ ఫాజిల్ మీదే కీ సీన్స్ తీయాల్సి ఉందట. కానీ ఆయన కాల్ షీట్స్ దొరకడం కష్టంగా ఉందట. ‘పుష్ప-2’కు ముందు అనుకున్న దాని కంటే డబుల్ కాల్ షీట్స్ ఇప్పటికే ఇచ్చాడట ఫాహద్. కానీ వాటిని సుకుమార్ అండ్ టీం సద్వినియోగం చేసుకోలేదు. తీసిన సీన్లే మళ్లీ తీసి.. కొన్ని సార్లు షూట్ క్యాన్సిల్ చేసి.. కొన్నిసార్లు ఒక రోజులో అనుకున్న సీన్ రెండు రోజులు తీసి.. ఇలా చాలా డేట్లు వృథా చేశారు. దీంతో ఫాహద్ విసుగెత్తిపోయినట్లు తెలుస్తోంది.

మలయాళంలో లీడ్ రోల్‌లో చేసే సినిమాలను నెల రోజుల్లో పూర్తి చేసేస్తుంటే.. ఇక్కడ ఈ నాన్చుడేంటి అంటూ ఆయన అసహనానికి గురైనట్లు సమాచారం. మల్టిపుల్ మూవీస్ చేస్తూ డేట్లు సర్దుబాటు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటే.. మళ్లీ మళ్లీ ‘పుష్ప-2’ టీం షూట్‌ను పొడిగిస్తూ కొత్తగా కాల్ షీట్స్ అడుగుతుంటే ఆయన ఫ్రస్టేట్ అవుతున్నాడట. దీంతో ఫాహద్‌న ఒప్పించి కొత్త షెడ్యూల్ కోసం డేట్లు తీసుకోవడం ‘పుష్ప-2’ టీంకు ఛాలెంజింగ్‌గా మారిందని.. దీంతో పాటు అల్లు అర్జున్ కాంబినేషన్లో క్లైమాక్స్ కోసం కూడా ఫాహద్ డేట్లు తీసుకోవాల్సి రావడంతో పంచాయితీ తప్పేలా లేదని అంటున్నారు.

This post was last modified on July 21, 2024 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

58 minutes ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

1 hour ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

2 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

3 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

3 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

4 hours ago