కొన్ని సంఘటనలు జరిగిన కాలంలో కన్నా ఎప్పుడో భవిష్యత్తులో ఊహించని టైంలో బయటపడి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటిదే ఇది కూడా. గత కొద్దిరోజులుగా దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉన్నారు. ఆగస్ట్ 9 మురారి రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు తెలిసిన విశేషాలను పంచుకుంటున్నారు. ఏదైనా సందేహం వెలిబుచ్చితే వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మూవీ లవర్ అంతఃపురం సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు.
అందులో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉండటం భలేగా అనిపించిందని, ఈ క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చిందంటూ అడిగాడు. నిజానికి టీవీలో చూసిన చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న ఇదే. దానికాయన షాకయ్యే సమాధానం ఇచ్చారు. అసలది తాను డిజైన్ చేసింది కాదని, జెమిని ఛానల్ ప్రసారంలో దాని ఎడిటర్ అలా కలర్స్ మారుస్తూ పోయాడు తప్పించి ఒరిజినల్ వెర్షన్ కేవలం ఎరుపు రంగు మాత్రమే ఉంటుందని తేల్చేశారు. దీంతో థియేటర్ లో మిస్ అయిపోయి కేవలం టీవీలో చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
అంటే ఇన్నాళ్లు క్రియేటివ్ డైరెక్టర్ తెలివి అనుకుంటున్న సౌందర్య చీర రహస్యం వెనుక టీవీ ఎడిటర్ ఉన్నాడన్న మాట. ఒకవేళ ఆయన చెప్పకపోయి ఉంటే రంగులు మారిన అబద్దం శాశ్వతంగా ఉండిపోయేది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కృష్ణవంశీ రూపొందించిన అంతఃపురం అప్పట్లో కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించింది. భర్త చనిపోయాక అతని జ్ఞాపకాల్లో ఉన్న సౌందర్య ప్రేమ, విషాదాన్ని కలగలిసి పాడుకునే పాటగా అసలేం గుర్తుకురాదు వస్తుంది. సీతారామశాస్త్రి సాహిత్యంతో ఇళయరాజా కంపోజింగ్ దాన్నో మర్చిపోలేని క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోయేలా చేసింది.
This post was last modified on July 21, 2024 12:58 pm
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…