వాలి, ఖుషి లాంటి చిత్రాలతో దర్శకుడిగా ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఎస్.జె.సూర్య. ఐతే ఆయన దర్శకుడిగా కంటే నటుడిగా రేపిన సంచలనమే ఎక్కువ. ‘నాని’ చిత్రాన్ని తమిళంలో ‘న్యూ’ పేరుతో తీసి తనే హీరోగా నటించి మెప్పించిన సూర్య.. ఇక్కడ డిజాస్టర్ అయిన చిత్రంతో అక్కడ సూపర్ హిట్ కొట్టడం విశేషం. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలోనే మరి కొన్ని చిత్రాలు చేశాడు కానీ.. వాటి కంటే వేరే దర్శకుల సినిమాల్లో చేసిన పాత్రలతో ఎక్కువ గుర్తింపు సంపాదించాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన ‘ఇరైవి’, సెల్వరాఘవన్ డైరెక్షన్లో నటించిన ‘నెంజం మరప్పుదిల్లై’ లాంటి చిత్రాలు చూస్తే సూర్య ఎంతటి విలక్షణ నటుడో.. తనను సరిగ్గా వాడుకుంటే క్యారెక్టర్లు ఎంత బాగా పండుతాయో అర్థమవుతుంది.
ఐతే ఇలాంటి వెరైటీ సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న సూర్య.. తర్వాత స్టార్ హీరోల కమర్షియల్ సినిమాల్లో నటించినపుడు మాత్రం మామూలుగా కనిపించాడు. ఇటీవలే ‘ఇండియన్-2’లో కూడా సూర్య పాత్ర తేలిపోయిన సంగతి తెలిసిందే.
తమిళ దర్శకులు సూర్య పాత్రలను ఈ మధ్య ఇలా తేల్చిపడేస్తుంటే.. ఓ తెలుగు దర్శకుడు మాత్రం తన స్పెషల్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకునేలా కనిపిస్తున్నాడు. ఆ దర్శకుడే వివేక్ ఆత్రేయ. తన డైరెక్షన్లో నాని హీరోగా చేస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రాలో సూర్యనే విలన్ పాత్ర చేస్తున్నాడు.
ఈ పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను ఈ రోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో కనిపించిన కొన్ని సెకన్లలోనే సూర్య చెలరేగిపోయాడు. ప్రేక్షకులను భయపెట్టేలా.. వారిలో క్యూరియాసిటీ పెంచేలా ఉందా పాత్ర. ఈ ఒక్క టీజర్‌తో సినిమా మీద హైప్ అమాంతం పెరిగేలా ఉందంటే అతిశయోక్తి కాదు. నాని వెర్సస్ సూర్య క్లాష్ చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది. టీజర్‌లో ఉన్నంత ఎగ్జైట్మెంట్‌గా సూర్య పాత్ర సినిమాలో కూడా ఉంటే ‘సరిపోదా శనివారం’ మాస్ హిట్ కావడం గ్యారెంటీ. ఆగస్టు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on %s = human-readable time difference 2:43 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…