ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా చిన్న సినిమా మీదకు జనాల దృష్టి పడేలా చేయడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అందులోనూ అధిక శాతం పరిచయం లేని ఆర్టిస్టులతో తెరకెక్కించినప్పుడు హైప్ తీసుకురావాల్సింది ప్రమోషన్లే.
పేరులోనే గమ్మత్తున్న విస్కీ దర్శకత్వం వహించిన ఈ యూత్ క్రైమ్ థ్రిల్లర్ కు పబ్లిసిటీ బానే చేశారు. హైదరాబాద్ లాంటి చోట్ల స్పెషల్ ప్రీమియర్లు వేశారు. ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేని ఇలాంటి మూవీస్ గతంలో ఆడిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి టీమ్ అదే నమ్మకంతో ఉంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశామని చెబుతున్న ది బర్త్ డే బాయ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం.
అమెరికాలో చదువుకునే అయిదుగురు స్నేహితులది జాలీ మనస్తత్వం. వాళ్లలో బాలు (మణి) పుట్టినరోజు రావడంతో పార్టీ చేసుకుంటూ పీకల దాకా తాగేసి ఆ మైకంలో బాలు మీద పడి భీభత్సం చేస్తారు. వాళ్ళ మధ్య నలిగిపోయి అతను చనిపోతాడు. దాంతో ఖంగారు పడి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడి అన్నయ్య లాయర్ భరత్ (రవికృష్ణ) ని పిలుస్తారు. శవాన్ని ఎలా మాయం చేయాలని ఆలోచన చేసి దాన్ని అమలు చేసే క్రమంలో బాలు తల్లి తండ్రులు (రాజీవ్ కనకాల, ప్రమోదిని) యుఎస్ వస్తారు. ఇక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. ఇది ప్రమాదమా లేక హత్యానేది అసలు కథ.
ట్రెండీ యూత్ ఎలిమెంట్ తీసుకున్న దర్శకుడు విస్కీ ఇలాంటి డార్క్ థ్రిల్లర్స్ కి అవసరమైన కుర్చీ అంచులో కూచోబెట్టే అంశాలను సరిగా కూర్చుకోలేకపోయాడు. దీంతో మొదలైనప్పటి నుంచి బాలు హత్య జరిగి రవికృష్ణ ఎంట్రీ ఇచ్చే దాకా ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఫ్లాట్ గా సాగిపోతుంది. సెకండాఫ్ లో చూపించే ఫ్లాష్ బ్యాక్ మరీ రొటీన్ గా ఉండటం ప్రధాన మైనస్ కాగా అసలు ట్విస్టుని రివీల్ చేసిన విధానం చాలా మాములుగా అనిపిస్తుంది. పాయింట్ ఎగ్జై టింగ్ ఉన్నప్పటికీ డెవలప్మెంట్ బలహీనంగా ఉండటం వల్ల ఈ పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ మెంట్, థ్రిల్ రెండూ మిస్సయ్యాయి.
This post was last modified on July 20, 2024 10:41 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…