గుంటూరు కారం ఫలితం అంచనాలకు తగ్గట్టు రాలేదని అభిమానులు బాధ పడినా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టామినా మీద ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే ఆ సినిమా మొదలైనప్పటి నుంచి ఎదురైన అవాంతరాలు, క్యాస్టింగ్ మార్పులు, స్క్రిప్ట్ రిపేర్లు ఇలా కర్ణుడి చావుకు బోలెడు కారణాలన్నట్టు మొత్తం కలిసి ఫైనల్ అవుట్ ఫుట్ మీద పడి రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇంత జరిగినా ఈ ఏడాది ఏడు నెలల్లో వచ్చిన బెస్ట్ ఆల్బమ్స్ లో టాప్ ప్లేస్ గుంటూరు కారందే కావడం విశేషం. ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానంలో అందరి ప్రశ్న ఒకటే. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయన నాలుగోసారి జట్టు కట్టడం గతంలోనే అధికారికంగా అయ్యింది కానీ ఎప్పుడు మొదలవుతుందనే దాని మీద సరైన సమాచారం లేకపోయింది. ఇవాళ బన్నీ వాస్ దాని గురించి కొంత సమాచారం ఇచ్చారు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడనంత గ్రాండియర్ గా ఆ కలయికలో సినిమా ఉంటుందని, కథగా కన్నా కాన్సెప్ట్ గా ఒక అద్భుతమైన సబ్జెక్టు రెడీ అవుతోందని, బడ్జెట్ కూడా అల్లు అరవింద్, చినబాబులు కార్పొరేట్ స్థాయిలో ఫైనాన్స్ తెచ్చుకునే రేంజ్ డిమాండ్ చేస్తుందని ఊరించారు. జానర్ ఏంటనేది చెప్పలేదు కానీ అంచనాలకు మించి అనే క్లూ అయితే ఇచ్చారు.
ఈ లెక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీల కాంబో సెట్స్ పైకి వెళ్లేందుకు టైం పడుతుంది. బన్నీ వాస్ చెప్పిన ప్రకారమే కేవలం ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నర పట్టొచ్చు. అంటే ఇంకో రెండేళ్ల దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పటిదాకా గడిచిపోయిన ఏడు నెలల కాలం అందులోనే కౌంట్ అవుతుందా లేదానేది వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారమైతే త్రివిక్రమ్ ఈసారి కల్కి 2898 ఏడి తరహాలో లార్జర్ థాన్ లైఫ్ సబ్జెక్టు సిద్ధం చేసుకున్నారట. తన మార్కు చూపిస్తూనే సరికొత్త ట్రీట్ మెంట్ తో విజువల్ గ్రాండియర్ ఆవిష్కరిస్తారట. ఈలోగా త్రివిక్రమ్ వేర్ హీరోతో ఇంకో సినిమా చేయడం అనుమానంగానే ఉంది.
This post was last modified on July 19, 2024 8:54 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…