గత మూడు నాలుగు రోజులుగా పుష్ప 2 గురించిన వార్తలతో సోషల్ మీడియా ఎంతగా హోరెత్తిపోతోందో చూస్తున్నాం. అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేశాడనే చిన్న వార్త పెద్ద ప్రకంపనం సృష్టించింది. ఒకేసారి తనతో పాటు దర్శకుడు సుకుమార్ వేర్వేరుగా విదేశాలకు వ్యక్తిగత ట్రిప్పుల మీద వెళ్లడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే న్యూస్ విపరీతంగా వైరలయ్యాయి. నేరుగా కలుసుకునే సందర్భం లేకపోవడంతో మీడియాకు క్లారిటీ తీసుకునే అవకాశం లేకపోయింది. ఇవాళ ఆయ్ పాట లాంచ్ సందర్భంగా బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ స్పష్టత ఇచ్చారు.
కేవలం పదిహేను రోజులకు సంబంధించిన పని మాత్రమే అల్లు అర్జున్ కు ఉందని, క్లైమాక్స్ తో పాటు మరొక్క పాట షూట్ చేస్తే అంతా అయిపోతుందని అన్నారు. పుకార్లను చూస్తూ నవ్వుకున్నామని, ఎవరికి వారు ఏవేవో అన్వయించుకుని రాశారని చెప్పారు. ఒకవేళ నిజంగా సుకుమార్ కనక ఇంకో ఆరు నెలలు పుష్ప 2 కోసం డిమాండ్ చేస్తే దాన్ని ఇచ్చి పుచ్చుకునే చనువు, స్నేహం వాళ్ళ మధ్య ఉన్నాయని, అలాంటప్పుడు ఇవన్నీ గాసిప్సని కొట్టిపారేశారు. సో పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ బయటికి రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అందరూ కోరుకునేది ఒకటే. డిసెంబర్ 6 పుష్ప 2 విడుదల కావాలి. ఎందుకంటే ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగిపోయి ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ వదులుకుని ఏడాది చివరికి వెళ్లాల్సి వచ్చింది. పుష్ప 1 అదే నెలలో వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో తేదీకి సంబంధించి టీమ్ లో ఎలాంటి టెన్షన్ లేదు. బిజీగా ఉన్న ఫహద్ ఫాసిల్ డేట్ల సమస్య కూడా ఆలస్యానికి కారణమని బన్నీ వాస్ చెప్పడం గమనార్హం. మొత్తానికి ఒక పెద్ద భారం దించినట్టే అయ్యింది. కాకపోతే వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టారనే శుభవార్త వినే వరకు ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టడం కష్టం. ఇప్పటికైతే బ్రేక్ పడింది.
This post was last modified on July 19, 2024 7:13 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…