Movie News

టీజర్ చూపించి అమ్మేసిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్లోకి సైలెంటుగా ఎంట్రీ ఇచ్చి ఉన్నట్లుండి రైజ్ అయిన యువ కథానాయకుల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. తన తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో సక్సెస్ అయింది. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ డివైడ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో అవకాశాలు వరుస కట్టాయి. కానీ హడావుడిగా సినిమాలు ఒప్పేసుకుని చేసేయడం వల్ల చాలా వరకు తేడా కొట్టాయి.

సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ మినహా సినిమాలన్నీ డిజాస్టర్లయ్యాయి. చివరగా కిరణ్ నుంచి వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ దారుణమైన డిజాస్టర్లుగా మిగలడంతో ఇక కిరణ్ పని అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ అతను బౌన్స్ బ్యాక్ కావడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్న కిరణ్.. ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం.

ఇటీవలే కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘క’ అనే పాన్ ఇండియా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కిరణ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా క్యూరియస్‌గా కనిపించింది దీని టీజర్. సినిమాలో దమ్ముందనే సంకేతాలు టీజర్లో కనిపించాయి. ఈ సినిమా టీజర్‌ ఇండస్ట్రీ వర్గాలను కూడా బాగానే ఆకర్షించింది. ఆ టీజర్‌తోనే దాదాపుగా బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చిందట. ఫ్యాన్సీ ఆఫర్లతో థియేట్రికల్ రైట్స్ కొనడానికి బయ్యర్లు ముందుకొచ్చినట్లు సమాచారం. బిజినిస్ డీల్స్ దాదాపుగా క్లోజ్ చేసేసినట్లే చెబుతున్నారు. డిజిటల్ హక్కులకు కూడా డిమాండ్ ఏర్పడిందట.

ఐతే వేరే నిర్మాతలతో కలిసి సొంత ప్రొడక్షన్లోనే ఈ సినిమాను చేసిన కిరణ్.. కొన్ని ఏరియాల వరకు సొంతంగా రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తున్నాడట. దీంతోపాటుగా ‘దిల్ రుబా’ అనే లవ్ స్టోరీ చేశాడు కిరణ్. ఐతే ‘క’నే ప్రామిసింగ్‌గా కనిపిస్తుండడంతో దాన్నే ముందు రిలీజ్ చేసి.. ఆ తర్వాత ‘దిల్ రుబా’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అతను భావిస్తున్నాడట.

This post was last modified on July 19, 2024 9:48 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

3 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

4 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

4 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

8 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

9 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

10 hours ago