దేవరతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న జాన్వీ కపూర్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడం అభిమానులను టెన్షన్ పెట్టింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జానీ ఆరోగ్యం తాలూకు అప్డేట్ ని తండ్రి బోనీ కపూర్ స్వయంగా వెల్లడించడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
ఫుడ్ పాయిజనింగ్ (ఆహార కల్తీ) వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని ప్రస్తుతం కోలుకుంటోందని చెప్పడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. త్వరలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ ఉల్లజ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలా జరగడంతో ప్రమోషన్లకు బ్రేక్ పడింది.
ఇక్కడ దేవర బృందం ఖంగారు పడటంలో తప్పేమీ లేదు కానీ ముప్పు తప్పింది కాబట్టి రిలాక్స్ అవ్వొచ్చు. ఆమె పాల్గొనాల్సిన కొంత టాకీ పార్ట్, పాటలు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. దర్శకుడు కొరటాల శివ వాటికి సంబంధించిన షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచారు.
మరి హైదరాబాద్ కు వచ్చే పరిస్థితిలో జాన్వీ ఉందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగి సెప్టెంబర్ 27 ఫైనల్ డాట్ లాక్ చేసుకున్న దేవర టీమ్ ఉరుకుల పరుగుల మీద పనులు చేస్తోంది. డేట్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా వర్క్స్ దృష్ట్యా రోజులు హారతిలాగా కరిగిపోతున్నాయి.
టెన్షన్ పడేందుకు అంతగా లేకపోయినా ఫుడ్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీగా జాన్వీకి ఎక్కడ ఆహారం తేడా కొట్టిందో తెలియాల్సి ఉంది. ఇటీవలే అంబానీ ఇంటి పెళ్లికి, ఉల్లజ్ ఈవెంట్లకు తప్ప బయటి ఎక్కడ తినలేదట. మరి తేడా ఎక్కడ జరిగిందో.
అయినా సామాన్యులు బయట ఫుడ్డు తిని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం సహజమే కానీ జాన్వీ లాంటి హీరోయిన్లు సైతం వీటి బారిన పడటం ఆశ్చర్యం కలిగించే విషయం. దేవర తర్వాత రామ్ చరణ్ 16లో ఆడిపాడనున్న శ్రీదేవి తనయ న్యాచురల్ స్టార్ నాని 33లో కూడా ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on July 18, 2024 9:53 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…