మంచు విష్ణు కెరీర్లోనే కాకుండా మోహన్ బాబు ఫ్యామిలీ బ్యానర్లలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప డిసెంబర్ లో విడుదలవుతుందని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హీరోనే స్వయంగా ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ నెల ఆరున పుష్ప 2 ది రూల్ ఉంది. దీని గురించి రకరకాల వార్తలు మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వాయిదా ఉంటుందేమోననే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. సరిగ్గా ఈ సమయంలో కన్నప్ప డిసెంబర్ లో వస్తున్నాడని చెప్పడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే తేదీని చెప్పకపోవడం గమనార్హం.
ఒకవేళ పుష్ప 2 ది రూల్ వచ్చినా కన్నప్పకి సలార్ తరహాలో డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని విష్ణు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. అదే టైంలో చైతు తండేల్, నితిన్ రాబిన్ హుడ్ ఉన్నాయి కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా అవి నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. భారీ క్యాస్టింగ్ క్యామియోలతో రూపొందిన కన్నప్పలో మార్కెట్ పరంగా ప్రభాస్ పాత్ర చాలా కీలకం కానుంది. ముఖ్యంగా ఉత్తరాది బిజినెస్ అమాంతం పెంచేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిడివి ఎక్కువే ఉంటుందనే తరహాలో విష్ణు గతంలోనే చూచాయగా చెప్పాడు.
సో ఇంకా అయిదు నెలల ముందే డిసెంబర్ రేస్ రసవత్తరంగా మారుతోంది. బయటికి చెప్పలేదు కానీ బాలయ్య 109 కూడా అదే నెల వైపు చూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే పోటీ మరింత టైట్ అవుతుంది. అయినా కర్చీఫ్ లు వేసుకోవడమే కానీ ప్యాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీద ఉంటాయన్న మాటమీద ఉండలేని తరుణంలో కన్నప్ప, పుష్ప 2, గేమ్ ఛేంజర్ ఇవన్నీ గ్యారెంటీ ఇవ్వలేని సిచువేషన్ లో ఉన్నాయి. డిసెంబర్ చెప్పేసారు కాబట్టి దానికి అనుగుణంగా కన్నప్ప ప్రమోషన్ల వేగం పెంచాల్సి ఉంటుంది. వరసగా ఈవెంట్లు, లాంచులు ఉండేలా మంచు బృందం ప్లానింగ్ లో ఉంది.
This post was last modified on July 18, 2024 1:23 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…