టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు అర్జున్ టాలీవుడ్లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. కానీ అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం కెరీర్ మొదలైన పదేళ్ల తర్వాత కూడా తడబడుతూనే ఉన్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో సినిమాలు ఓ మోస్తరుగా ఆడినా అతడి కెరీర్ మాత్రం అనుకున్నంతగా ఊపందుకోలేదు.
ఊర్వశివో రాక్షసివో తర్వాత శిరీష్ ఎంతో గ్యాప్ తీసుకుని బడ్డీ అనే సినిమా చేస్తే.. ఇది జనాల దృష్టిలోనే పడడం లేదు. మేకింగ్ దశలో టీం చాలా సైలెంటుగా ఉండిపోయింది. సినిమా ఫస్ట్ కాపీ తీశాక నేరుగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జులై 26న బడ్డీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
ఐతే ట్రైలర్ లాంచ్ చేసి, రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా ఈ సినిమా గురించి ఎక్కడా చర్చే లేకపోయింది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డా సోషల్ మీడియాలో సౌండ్ లేదు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని.. పైగా కల్కి లాంటి పెద్ద సినిమా తర్వాత టాలీవుడ్లో వాతావరణం కొంచెం స్తబ్దుగా మారిపోవడంతో వేరే సినిమాల వైపు ప్రేక్షకులు చూడట్లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ వారం రిలీజవుతున్న డార్లింగ్ గురించి కూడా పెద్దగా ప్రేక్షకుల్లో డిస్కషన్ లేదు. ఈ నేపథ్యంలోనే బడ్డీ మూవీని వారం వాయిదా వేసి ఆగస్టు 2న రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. కొత్త డేట్‌తో పోస్టర్ కూడా బయటికి వచ్చింది. అప్పటికైనా సినిమాకు ఆశించిన హైప్ వస్తుందా.. రిలీజ్ ముంగిట ప్రమోషన్ల హడావుడి పెంచి సినిమా పేరు జనాల్లో నానేలా చేస్తారా.. చూడాలి మరి.
This post was last modified on July 17, 2024 10:24 pm
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…