పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపున్న తెలుగు నటుల్లో రానా దగ్గుబాటి ఒకడు. ‘బాహుబలి’ కంటే ముందే అతను రెండు బాలీవుడ్ చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించాడు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. తర్వాత తన ప్రతి సినిమా పట్ల పర భాషా నటులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఒక టైంలో బహు భాషల్లో విరామం లేకుండా సినిమాలు చేశాడు రానా. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు. కానీ ఈ మధ్య అతడి కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. గత ఏడాది కాలంలో తన నుంచి కొత్త రిలీజే కాలేదు. ఓటీటీలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్‌ను పక్కన పెడితే.. గత రెండేళ్లలో సినిమా రిలీజ్‌లే లేవు. చివరగా రెండేళ్ల కిందట ‘విరాటపర్వం’ చిత్రంతో పలకరించాడతను. బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడిగా కనిపించిన రానా.. ఇంత గ్యాప్ తీసుకున్నాడేంటి అని తన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఒక సినీ వేడుకలో రానా తన కెరీర్లో గ్యాప్ రావడంపై స్పందించాడు. “నా జీవితమంతా కొత్త కొత్త ప్రయత్నాలే చేస్తూ వచ్చాయి. కానీ ఆ సినిమాలు ఇప్పుడు మామూలు అయిపోయాయి. వాటిని మించి కొత్తగా ఏదైనా చేయాలని కథలు వెతుకుతున్నా. ఈ వెతుకులాటలోనే రెండేళ్లు గడిచిపోయాయి. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు పంచుకుంటా. ఏ సినిమా చేసినా ఎగ్జైటింగ్‌గా ఉండాలన్నది నా ఉద్దేశం” అని రానా చెప్పాడు.
‘లీడర్-2’ చేస్తారా అని రానాను అడిగితే.. ఆ ప్రశ్న శేఖర్ కమ్ములను అడగాలని నవ్వేశాడు. రానా ప్రస్తుతం ‘రానా నాయుడు-2’లో నటిస్తున్నాడు. దీని ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వెంకీ లాంటి ఫ్యామిలీ హీరోను పెట్టి అడల్ట్ డోస్ గట్టిగా ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకించారు. మరి సెకండ్ సీజన్లో కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 17, 2024 4:00 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…