పెద్ద సినిమాకు టికెట్ రేట్లు పెంచమని విన్నవించుకోవడం తప్పు కాదు. ఎలాగూ ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి పెట్టుబడిని వీలైనంత త్వరగా వెనక్కు తెచ్చుకోవడానికి ఇది మంచి మార్గమే.
కానీ కల్కి 2898 ఏడి, ఆర్ఆర్ఆర్ లాగా బ్రహ్మాండమైన టాక్ వచ్చి జనాలందరూ ఆహా ఓహో అని మెచ్చుకుంటే ధరతో సంబంధం లేకుండా బుకింగ్స్ హోరెత్తిపోతాయి. అలా కాకుండా జనాల తీర్పు స్పష్టంగా వచ్చాక కూడా ఫ్లాప్ అయినా పర్లేదు చూద్దామనుకునే కాసింత ప్రేక్షకులను ఆపేలా వీకెండ్ తర్వాత రేట్లు తగ్గించకపోవడం వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న వైనం బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది.
గతంలో ఆచార్యకు జరిగిందే ఇప్పుడు భారతీయుడు 2కి రిపీట్ అవుతోంది. మొన్నటి ఏడాది మెగా మూవీకి మార్నింగ్ షోకే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. స్పష్టంగా తిరస్కారం అర్థమైపోయింది. కానీ టికెట్ ధరలు హైక్ తో పాటు వారం రోజుల దాకా కొనసాగడంతో రెండో రోజు నుంచే విపరీతమైన డ్రాప్ కనిపించింది.
ముఖ్యంగా నైజాం ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు భారతీయుడు 2కి ఇదే కనిపిస్తోంది. మంగళవారం లాంటి వీక్ డేలో హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా చూడాలంటే 350 రూపాయలు చెల్లించాల్సిందే. మాములుగా గరిష్ట ధర 295 కాగా రెగ్యులర్ ప్రైజ్ 200 లోపే ఉండాలి
ఇలా ధరలను తగ్గించకుండా ఎలాగూ పర్మిషన్ ఉంది కదాని వారం పాటు కొనసాగించడం వల్ల వచ్చే కొద్దిపాటి జనాలు ఆగిపోయి అక్కడ థియేటర్లు ఖాళీ సీట్లతో దర్శనమిస్తూ, షోలు క్యాన్సిలవుతూ, ఫైనల్ గా నష్టపోతోంది ఎవరంటే సదరు డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలే. ఇకనైనా ఈ ధోరణి మారాలి. టాక్ ని బట్టి ఫస్ట్ వీకెండ్ కాగానే రేట్లు తగ్గించాలా లేక అలాగే ఉంచాలా అనే నిర్ణయం వేగంగా తీసుకునేలా వ్యవస్థలో మార్పు రావాలి. అంతే తప్ప ఎలాగూ డిజాస్టర్ అయ్యిందని రేట్లను అలాగే వదిలేయడం వల్ల జరిగే ముప్పే ఎక్కువ. దానికి సాక్ష్యం సోమా మంగళవారాల్లో భారతీయుడు 2కి వచ్చిన అత్తెసరు కలెక్షన్లే.
This post was last modified on July 16, 2024 6:29 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…