దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా తనదైన ముద్ర వేసేందుకు కష్టపడుతున్న జాన్వీ కపూర్ బాలీవుడ్ లో బోలెడు సినిమాలు చేసింది కానీ నెంబర్ వన్ అనిపించుకునే టాప్ లీగ్ లోకి చేరలేకపోయింది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ చేయడంతో పాటు సల్మాన్, షారుఖ్ లాంటి సీనియర్ల సరసన గువ్వపిల్లలా కనిపించడం లాంటి కారణాలు తనకు పెద్ద అవకాశాలు రాకుండా చేస్తున్నాయి. అయితేనేం టాలీవుడ్ లో మాత్రం గ్రాండ్ ఎంట్రీ దొరుకుతోంది. ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఆల్రెడీ రెండు క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మూడో దానికి రంగం సిద్ధమవుతోందని ఫిలిం నగర్ టాక్. దసరా తర్వాత తమ కాంబోని మరోసారి రిపీట్ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ ప్యాన్ ఇండియా మూవీకి జానీ కపూర్ అయితే బాగుంటుందని భావించి ఆ మేరకు సంప్రదింపులు జరిపారని తెలిసింది. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రతిపాదన అయితే వెళ్లిందట. జాన్వీ ప్రస్తుతం దేవర 1 బాలన్స్ షూటింగ్ తో పాటు ఇతర బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ 16 కోసం ఇంకా డేట్లు ఇవ్వలేదు. సెప్టెంబర్ షెడ్యూల్ ఖరారయ్యాక కాల్ షీట్స్ లాకవుతాయి.
నానిది కూడా ఒకే చేసుకుంటే జాన్వీ కపూర్ తెలుగులో బలమైన ముద్ర వేసేందుకు ఛాన్స్ దొరుకుతుంది. ప్రస్తుతం ఇక్కడ హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. సీనియర్ల సంగతేమో కానీ క్రేజ్ ఉన్న ఇప్పటి జనరేషన్ స్టార్లకు సైతం జోడీని సెట్ చేయడం దర్శకులకు సవాల్ గా మారుతోంది. జాన్వీ లాంటి వాళ్ళు ఇక్కడి కెరీర్ ని సీరియస్ గా తీసుకుంటే హైదరాబాద్ లోనే సెటిలైపోవచ్చు. శ్రీదేవికి ఒకప్పుడు తిరుగులేని స్టార్ డం ఇచ్చిన పరిశ్రమల్లో టాలీవుడ్ దే మొదటి స్థానం. మరి జాన్వీ కపూర్ కూడా అదే తరహాలో ఆలోచించి అవకాశాలు ఒడిసిపట్టుకుందేమో చూడాలి. డెబ్యూ దేవర సెప్టెంబర్ 27 రిలీజవుతుంది.
This post was last modified on July 16, 2024 12:12 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…